Hardik Pandya is a New T20I Captain for India for T20 World Cup 2024: బంగ్లాదేశ్ పర్యటనను ముగించిన భారత్.. మరో ఆసక్తికర సమరానికి సిద్ధమవుతోంది. కొత్త ఏడాదిలో సొంతగడ్డపై శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌లు ఆడనుంది. 2023 జనవరి 3 నుంచి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆరంభం కానుండగా.. జనవరి 10 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ పర్యటన కోసం మంగళవారం (డిసెంబర్ 27) బీసీసీఐ భారత జట్లను ప్రకటించనుంది. ఇప్పటికే తొలగించబడిన చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. టీమ్స్ వివరాలను ప్రకటించనుంది. జట్ల ప్రకటనతో పాటు టీ20 కొత్త కెప్టెన్‌ని కూడా ఈ సెలక్షన్ కమిటీ ప్రకటించే అవకాశం ఉంది.
ఇన్‌సైడ్ స్పోర్ట్ నివేదిక ప్రకారం.. స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యాను భారత టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌గా బీసీసీఐ అధికారికంగా ప్రటించనుందట. తదుపరి టీ20 ప్రపంచకప్ వరకు పాండ్యాకు జట్టు పగ్గాలు అప్పగించే అవకాశం ఉందట. అంటే రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ జట్టులోకి వచ్చినా.. హార్దిక్ సారథిగానే కొనసాగుతాడు అని ఇన్‌సైడ్ స్పోర్ట్ తెలిపింది. బీసీసీఐ అధికారి ఒకరు ఇన్‌సైడ్ స్పోర్ట్‌తో మాట్లాడుతూ... 'భారత కొత్త టీ20 కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ఎదగడానికి సమయం ఆసన్నమైంది. ప్రస్తుత జట్టులో రోహిత్ శర్మతో పాటు పలువురు ఆటగాళ్లు 2024 వరకు కొనసాగే అవకాశం లేదు' అని అన్నారు.
టీ20 ప్రపంచకప్ 2022 ఓటమి తర్వాత 35 ఏళ్ల రోహిత్ శర్మ కెప్టెన్సీ ప్రమాదంలో పడింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ ఈ సంవత్సరం ఆసియాకప్ 2022 ట్రోఫీని కూడా గెలుచుకోలేకపోయింది. టీ20లలో రోహిత్‌కు అద్భుతమైన రికార్డు ఉన్నా.. టైటిల్స్ మాత్రం సాదించలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలోనే రోహిత్ టీ20 జట్టుకు కెప్టెన్‌గా కొనసాగడం కష్టంగా మారింది. అదే సమయంలో హార్దిక్ పాండ్యాకు మంచి ట్రాక్ రికార్డు కూడా ఉంది. ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు టైటిల్ కూడా అందించాడు.
బంగ్లాతో సిరీస్ సందర్భంగా బొటన వేలికి అయిన గాయంతో బాధపడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ ఇంకా కోలుకోకపోవడంతో.. శ్రీలంకతో సిరీస్ ఆడేది కష్టమేనని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. శ్రీలంకతో వన్డే సిరీస్ సమయానికి రోహిత్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం తెలుస్తోంది. రోహిత్ ఇంకా 100 శాతం ఫిట్‌గా లేడని, గాయం విషయంలో ఇప్పుడే ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని బీసీసీఐ భావిస్తోందట. వివాహం కారణంగా కేఎల్ రాహుల్, విశ్రాంతి కారణంగా విరాట్ కోహ్లీ కూడా టీ20లకు దూరమవనున్నారట.
Also Read: ఫుల్ ఛార్జితో 300 కిలోమీటర్ల ప్రయాణం.. ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను కళ్లు మూసుకొని కొనేయొచ్చు!
Also Read: Cheapest Phone: రూ. 350కే శాంసంగ్ ఫోన్.. అదనపు ఛార్జ్ చెల్లించాల్సిన అవసరం లేదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
శ్రీలంక సిరీస్‌కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం.. టీ20 జట్టుకు కొత్త కెప్టెన్! రోహిత్ ఉన్నా అతడే
శ్రీలంక సిరీస్‌కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం
టీ20 జట్టుకు కొత్త కెప్టెన్
రోహిత్ శర్మ జట్టులోకి వచ్చినా అతడే