డియర్ జిందగీ: చెప్పడం కన్నా.. వినడమే మిన్నా

భగవండుతు మనకు రెండు చెవులు ఇచ్చాడు.. కానీ ఒకటే నోరు ఇచ్చాడు.. దీనర్థం తక్కవ మాట్లాడు ఎక్కువ వినమని.. కానీ మనం చేస్తుంది ఏమిటీ..?

Last Updated : Jun 30, 2018, 12:05 PM IST
డియర్ జిందగీ: చెప్పడం కన్నా.. వినడమే మిన్నా

దయాశంకర్ మిశ్రా, డిజిటల్ ఎడిటర్, జీ న్యూస్ హిందీ

మన చుట్టుపక్కల ఎంతటి భయానక పరిస్థితులు ఉన్నాయంటే ఎదుటి వారు ఏం చెబుతున్నారో వినలేని పరిస్థితి. దీనికి ధ్వని కాలుష్యం ఒక కారణమైతే.. ఎదుటి వారి మాటను వినే అలవాటు లేకపోవడం మరో కారణం. ఇందులో మొదటిది అంతగా ప్రమాదకరం కాదు.... అయితే  రెండో కారణమే ఆలోచించదగింది.

ఎదుటి వాళ్ల మాటను వినడానికి ఇష్టపడని వారు.. వారిని అర్ధం చేసుకోలేరు. వినడానికి ఇష్టపడనప్పుడు మనకు తెలియకుండానే మనం ఇతరుల మనస్సులో నుంచి స్థానం కోల్పోతున్నాం. ఇది ఇతరులతో మన సంబంధాలు చెడిపోవడానికి  ప్రధాన కారణమౌతోంది. మన చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించినట్లయితే ఇలాంటి వ్యక్తులు ఎందరో తారసపడుతుంటారు కదూ

గత డియర్ జిందగీలో  ప్రేమ, సంభాషణ ప్రాధాన్యత గురించి చర్చించుకున్నాం.. ప్రేమతో చేసిన సంభాషణ వల్ల జీవితం సాఫీగా సాగుతుందని తెలుసుకున్నాం. సంతోషకర జీవితానికి ప్రేమను పంచుతూ ..ఎదుటి వాళ్లతో మంచిగా కమ్యూనికేట్  చేస్తుండాలి. కమ్యూనికేట్ చేయాలంటే ఎదుటి వాళ్లను మనం అర్థం చేసుకోవాలి..దీని కోసం మనం వినడానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది.

జయ్ పూర్ కు చెందిన జూహీ వర్మ తను పెళ్లి చేసుకోవడానికి ఆర్ధిక అంశాల కంటే విలువలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. పెద్దగా ఆస్తి పాస్తులు లేకపోయినా..  ఇంట్లో  ప్రేమానురాగాలు, పరస్పర గౌరవం, ఎదుటి వారి మాటలకు విలవ ఉంటుందో అలాంటి వారినే పెళ్లి చేసుకోవాలనుకుంటోంది.  ఇవన్నీ లేకుండా ఆస్థి పాస్తులు ఎన్ని ఉన్నా వ్యర్థమని డిసైట్ అయింది.. ఎందుకంటే విలువలు, ప్రేమ, పరస్పర గౌరవం లేకుండా ఎన్ని ఆస్తులున్నా అవన్నీ వ్యర్థమని భావిస్తోంది జూహీ బలంగా నమ్మింది కాబట్టి. జూహి ఊహిస్తున్నట్లు దాంపత్య జీవితంలో ఆర్ధిక అంశం కంటే విలువలే కీలక పాత్ర పోషిష్తానయనే విషయం మనం గ్రహించాల్సి ఉంది.

వాస్తవానికి మనలో చాలా మంది దంపతులు ఒకరి మాట మరోకరు వినరు. ఫలితంగా ఒకరినొకరు అర్థం చేసుకోలేక పోతున్నారు. ఇదే అన్ని అనర్ధాలకు దారి తీస్తోంది. చివరకు సమస్య విడాకులకు దారిస్తోంది. కాబట్టి దాంపత్య జీవితం సాఫీగా సాగాలంటే భాగస్వామి చెబుతున్న మాటలను మనం క్షుణంగా వినాల్సిన అవసరం ఉంది. అప్పుడే జీవితం సాఫీగా సుఖ సంతోషాలతో నడుస్తుంది. ఇది ఒక్క దాంపత్య జీవితంలోనే కాదు.. సమాజంలో ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. మనం ఎదుటి వాళ్ల మాటను వినగలినప్పుడే మనం అవతలి వారిని అర్థం చేసుకోగలం. 

భగవండుతు మనకు రెండు చెవులు ప్రసాదించాడు..కానీ ఒకటే నోరు ఇచ్చాడు.. దీనర్థం తక్కువ మాట్లాడి.. ఎక్కువ వినమని.. కానీ మనం చేస్తుంది ఏమిటీ..? ఇందుకు విరుద్ధంగా నడుచుకుంటున్నాం కదూ. ఇది చిన్న విషయమనుకుంటే అది పెద్ద పొరపాటు జరిగినట్లే . ఎందుకంటే ఎదుటి వారిని అర్ధం చేసుకోవాలంటే ముందు వారు ఏం చెబుతుందో వినాలి.. వినడం ప్రాక్టీస్ చేద్దామా మరి...

 

తాజా కథనంపై మీ విలువైన సూచనలు, సలహాలు ఇవ్వగలరు: 
https://www.facebook.com/dayashankar.mishra.54, https://twitter.com/dayashankarmi

 

Trending News