Ind Vs Ban: వద్దనుకున్న ప్లేయర్ పెద్ద దిక్కయ్యాడు.. టీమిండియా విజయంలో అతనిదే కీ రోల్

Ind Vs Ban 2nd Test Highlights: బంగ్లాదేశ్‌ టూర్‌ను టీమిండియా విజయంతో ముగించింది. వన్డే సిరీస్‌ను కోల్పోగా.. టెస్ట్ సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేసుకుంది. ఈ సిరీస్‌లో ఓ ప్లేయర్‌ జట్టులోకి తిరిగి వచ్చి.. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2022, 02:12 PM IST
Ind Vs Ban: వద్దనుకున్న ప్లేయర్ పెద్ద దిక్కయ్యాడు.. టీమిండియా విజయంలో అతనిదే కీ రోల్

Ind Vs Ban 2nd Test Highlights: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను టీమిండియా 2-0 తేడాతో గెలుచుకుంది. రెండో టెస్టులో ఓటమి అంచున ఉన్న జట్టును శ్రేయస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్ అద్భుతంగా పోరాడి జట్టుకు విజయాన్ని అందించారు. దీంతో 145 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి ఛేధించింది. ఇక ఈ సిరీస్‌లో ఛతేశ్వర్ పుజారా తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. జట్టులో స్థానమే కష్టం అనుకుంటున్న తరుణంలో ఈ సిరీస్‌కు వైస్‌ కెప్టెన్‌గా ఎన్నికై.. సూపర్ బ్యాటింగ్‌తో మ్యాన్‌ ఆఫ్ ద సిరీస్ అవార్డుకు కూడా గెలుచుకున్నాడు.

ఇరు జట్ల మధ్య జరిగిన ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు పుజారా. 222 పరుగులు చేయడంతోపాటు చాలాకాలం తరువాత సెంచరీ కూడా చేశాడు. ఈ ఏడాది పుజారా కెరీర్‌లో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో పేలవమైన ఫామ్‌తో జట్టు నుంచి చోటు కోల్పోయాడు. 34 ఏళ్ల పుజారా తిరిగి జట్టులోకి రావడం అసాధ్యమని చాలా మంది సీనియర్లు అన్నారు. కానీ అతను ఫస్ట్ క్లాస్, లిస్ట్ క్రికెట్‌లో గొప్ప ఆటతీరును కనబర్చాడు. జట్టులోకి తిరిగి వచ్చి.. తాను ఎంత విలువైన ఆటగాడో నిరూపించుకున్నాడు.

మొదటి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 102 పరుగులు చేసి పుజారా నాటౌట్‌గా నిలిచాడు. అంతకుముందు అతని చివరి సెంచరీ 2019 జనవరిలో సిడ్నీలో ఆస్ట్రేలియాపై నమోదైంది. పుజారా తన టెస్టు కెరీర్‌లో ఇప్పటివరకు 19 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈ సీనియర్ ప్లేయర్ తిరిగి ఫామ్‌లోకి రావడం టీమిండియాకు గొప్ప వార్త. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్‌లో జట్టులో ఈ వెటరన్ ప్లేయర్ కీరోల్ పోషించే అవకాశం ఉంది.

రెండో టెస్టులో నాటకీయ పరిణామాల మధ్య భారత్ గెలిచింది. బంగ్లాదేశ్ విధించిన 145 పరుగుల స్పల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు తడపడింది. రవిచంద్రన్ అశ్విన్ (42), అక్షర్ పటేల్ (34), శ్రేయస్ అయ్యార్ (29) రాణించడంతో గట్టెక్కింది. లేకపోతే బంగ్లా చేతిలో పరాజయం పాలయ్యేదే. 74 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన దశలో శ్రేయస్, అశ్విన్ గొప్పగా పోరాడారు. బంగ్లా బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా జట్టును విజయతీరాలకు చేర్చారు. 

Also Read: Ind Vs Ban: రెండో టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ.. సిరీస్ క్లీన్‌స్వీప్  

Also Read: Vishnu Priya: యాంకర్ విష్ణు ప్రియ అందాలి విందు.. థైస్ షోతో రచ్చ  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News