Special Trians: సంక్రాంతికి సొంతూరికి వెళ్లే వారికి శుభవార్త.. అందుబాటులోకి స్పెషల్ ట్రైన్లు.. పూర్తి వివరాలు ఇవే..

Sankranti Special Trains: ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వేస్ గుడ్‌న్యూస్ చెప్పింది. సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు నడుతున్నట్లు తెలిపింది. రైళ్లకు సంబంధించిన వివరాలను ట్విట్టర్‌లో వెల్లడించారు అధికారులు. పూర్తి వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2022, 10:39 AM IST
  • సంక్రాంతికి పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లు
  • వివరాలను వెల్లడించిన అధికారులు
  • వివిధ రూట్లలో తిరగనున్న స్పెషల్ ట్రైన్స్
Special Trians: సంక్రాంతికి సొంతూరికి వెళ్లే వారికి శుభవార్త.. అందుబాటులోకి స్పెషల్ ట్రైన్లు.. పూర్తి వివరాలు ఇవే..

Sankranti Special Trains: సంక్రాంతి పండుగకు వేలాది మంది సొంతూళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. పండుగ సమయానికి బస్సులు, ట్రైన్లు, ప్రైవేట్ వాహనాలు భారీగా రద్దీతో నిండిపోనున్నాయి. ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉండడంతో దక్షిణ మధ్య రైల్వే శుభవార్త తెలిపింది. సంక్రాంతికి ప్రత్యేక రైళ్లను నడుతున్నట్లు ప్రకటించింది. ఈ సంక్రాంతికి 14 స్పెషల్ ట్రైన్స్‌ను వివిధ రూట్స్‌లో నడుపుతున్నట్లు వెల్లడించింది. ఈ ప్రత్యేక రైళ్లు ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లోనే ప్రయాణించనున్నాయి.

ఈ మేరకు  దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పెషల్ ట్రైన్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ట్విట్టర్‌లో వెల్లడించారు. మచిలీపట్నం-కర్నూల్, మచిలీపట్నం-తిరుపతి, విజయవాడ-నాగర్‌సోల్, కాకినాడ-లింగంపల్లి, అకోలా-పూర్ణ పట్టణాల మధ్య స్పెషల్ ట్రైన్స్ నడుతుపున్నట్లు తెలిపారు. మచిలీపట్నం నుంచి కర్నూలు సిటీ (ట్రైన్ నెంబర్.07067) జనవరి 3,5,7,10,12,14,17వ తేదీలలో అందుబాటులో ఉండనుంది. అదేవిధంగా కర్నూలు సిటీ నుంచి మచిలీపట్నం (ట్రైన్ నెం.07068) 4,6,8,11,13,15,18వ తేదీలలో నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. మచిలీపట్నం నుంచి తిరుపతి (ట్రైన్ నెం.07095) 1,2,4,6,8,9,11,13,15,16వ తేదీలలో రైలు నడుపుతున్నట్లు చెప్పారు. 

అదేవిధంగా తిరుపతి నుంచి మచిలీపట్నం (రైలు నెం.07096) 2,23,5,7,9,10,12,14,16,17వ తేదీలలో స్పెషల్ ట్రైన్ రన్ అవుతున్నట్లు అధికారులు తెలిపారు. విజయవాడ నుంచి నాగర్‌సోల్ (ట్రైన్ నెం.07698) 6,13వ తేదీలలో, నాగర్‌సోల్ నుంచి విజయవాడ (07699) 7,14వ తేదీలలో రైళ్లు నడుపుతున్నట్లు వెల్లడించారు. కాకినాడ నుంచి లింగంపల్లి (07445) వరకు  2,4,6,9,11,13,16,18వ తేదీలలో.. లింగంపల్లి నుంచి కాకినాడ (07446)కు 3,5,7,10,12,14,17,19వ తేదీలలో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు చెప్పారు. 

పూర్ణ నుంచి తిరుపతికి (ట్రైన్ నెం.07607) 2,9,16వ తేదీలలో, తిరుపతి నుంచి పూర్ణకు (రైలు నెం.07608) 3,10,17వ తేదీలలో స్పెషల్ ట్రైన్స్ నడవనున్నాయి. అదేవిధంగా తిరుపతి నుంచి అకోలా (07605) ట్రైన్ 6,13వ తేదీల్లో.. అకోలా నుంచి తిరుపతికు (07606)  8, 15వ తేదీలలో  ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్ (07185)కు 1,8,15వ తేదీలలో.. సికింద్రాబాద్ నుంచి మచిలీపట్నం వరకు (07186) 1,8,15వ తేదీలలో రైళ్లు తిరగనున్నాయని అధికారులు వెల్లడించారు. స్పెషల్ ట్రైన్స్‌కు సంబంధించిన చాట్‌ను అధికారులు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.  

 

Also Read: రాజకీయాలలో భీష్మ పితామహుడు.. ఆ రికార్డు సాధించిన ఏకైక ఎంపీ.. అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి స్పెషల్

Also Read: Chalapathi Rao Death: టాలీవుడ్లో మరో తీవ్ర విషాదం.. సీనియర్ నటుడు చలపతి రావు మృతి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News