Tollywood in tension due to new corona variant BF.7: దేశవ్యాప్తంగా కరోనా కలకలం పెద్ద ఎత్తున సృష్టించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు సుమారు రెండేళ్ల పాటు భారతదేశం మొత్తాన్ని వణికించి చాలా రోజుల పాటు లాక్ డౌన్ లోకి నెట్టివేసిన కరోనా ఇప్పుడు తన రూపాన్ని మార్చుకుంటుంది. ఇప్పుడు ఒక కొత్త వేరియంట్ మళ్లీ చైనాలో పుట్టడంతో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఆందోళన మొదలైంది.
ఏకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం చైనాను దాని వివరాలు సమర్పించాలని కోరడం హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. గుజరాత్ లో రెండు ఒడిశాలో ఒకటి చొప్పున కొత్త కరోనా వేరియంట్ కేసులు నమోదు కావడంతో భారత ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసింది. గుంపుగా ఒక చోట ఉండవద్దని బయటకు వెళ్లే వాళ్ళు మాస్కులు ధరించాలని కేంద్రం అయితే హెచ్చరికలు జారీ చేసింది.
అయితే మిగతా అన్ని పరిశ్రమల మీద ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఈ కొత్త వేరియంట్ అయితే చైనాను ఇప్పటికే ఇది వణికిస్తోంది అనే వార్తలు వింటున్న టాలీవుడ్ జనం అయితే వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు టాలీవుడ్ లో నిర్మితమవుతున్న సినిమాల బడ్జెట్ లెక్కలు వేసుకుంటే అవి వేల కోట్ల దాకా ఉంటాయి. ఎందుకంటే ఒక ప్రభాస్ మీద తెరకెక్కుతున్న సినిమాల మార్కెట్ చూసుకుంటేనే అది 3000 కోట్లను దాటేస్తోంది.
ఇక మిగతా హీరోల అందరి లెక్కలు కనక చూసుకుంటే కచ్చితంగా పది వేల కోట్లు దాటేస్తుందని చెప్పక తప్పదు. ఇలా ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా కరోనా కోరల నుంచి బయటపడి యధా యధావిధిగా షూటింగ్స్ చేసుకుంటున్నాము అంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మరో మారు ఆంక్షలు గనుక పెడితే పరిస్థితి ఏంటో అని అందరూ వణికిపోతున్నారు ఇప్పుడిప్పుడే జనాలు బయటకు ముఖ్యంగా సినిమా థియేటర్లు కూడా వస్తున్న నేపథ్యంలో మరోసారి ఆంక్షలు విధిస్తే సినిమా షూటింగ్స్, సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు, విడుదలకు సిద్ధమవుతున్న సినిమాల పరిస్థితి ఏమిటో అని అందరూ కూడా టెన్షన్ పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. చూడాలి మరి ఈ కరోనా తెలుగు సినీ పరిశ్రమ మీద ఎంత ఎఫెక్ట్ చూపించబోతుంది అనేది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.