Seeds For Diabetes Mellitus: చాలా మంది మిక్సుడ్ సీడ్స్ ప్రస్తుతం మార్కెట్‌లో తెగ విక్రయిస్తున్నారు. ఎందుకంటే వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల చాలా రకాల పోషకాలు శరీరానికి అందుతాయని తెలిసిందే. సీడ్ మిక్స్ శీతాకాలంలో వచ్చే చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా శరీరాన్ని అనారోగ్య సమస్యల నుంచి రక్షిస్తుంది. కాబట్టి రోగ నిరోధక శక్తి సమస్యలతో బాధపడేవారికి అరోగ్య నిపుణులు వీటిని తినమని సూచిస్తారు. గుమ్మడికాయ గింజలు, లిన్సీడ్, నల్ల నువ్వులను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఎప్పుడు తినాలి:
కేవలం 1 చెంచా పరిమాణంలో విత్తనాలను ప్రతి రోజూ తింటుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా బాడీ వీక్‌నెస్‌తో బాధపడుతున్నవారు ఈ విత్తనాలను ప్రతి రోజూ నాలుగు చెంచాల కన్న ఎక్కువగా తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి:
సీడ్ మిక్స్ ప్రతి రోజూ తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు రక్త పోటును నియంత్రించి తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. కాబట్టి గుండె సంబంధిత అనారోగ్య సమస్యలున్న వారు ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.
జీర్ణక్రియకు చాలా మంచిది:
అజీర్ణం, గ్యాస్ సమస్యలతో బాధపడుతున్నవారికి సీడ్ మిక్స్ ప్రభావవంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది. ముఖ్యంగా పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
మధుమేహాన్ని నియంత్రిస్తాయి:
డయాబెటిస్‌తో బాధపడుతున్నవారికి సీడ్ మిక్స్ ఔషధంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రించడానికి సహాయపడతాయి. దీంతో మధుమేహం అదుపులో ఉంటుంది.
జుట్టు, చర్మానికి మేలు చేస్తుంది:
చలి కాలం కారణంగా ప్రస్తుతం చాలా మంది జుట్టు, చర్మం ఇతర సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన సీడ్ మిక్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Buttabomma poster copy: పోస్టర్ ను కూడా కాపీ కొట్టాలా..పాపం నాగవంశీని ఆడేసుకుంటున్నారుగా
Also Read: Ashu Reddy Hot Photos: బ్లాక్ డ్రెస్సులో అషు రెడ్డి అందాల విందు.. ఎద అందాలన్నీ కనిపించేలా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
Diabetes: సీడ్ మిక్స్ ప్రతి రోజూ తింటే ఈ తీవ్ర వ్యాధులకు చెక్..