పీరియడ్స్ సమయంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలు ఆరోగ్యపరంగా మంచిదా కాదా..వైద్యులు ఏం చెబుతున్నారో పరిశీలించుకోవాలి. పీరియడ్స్ సమయంలో ఈ సమస్యలు సాధారణమే అయినా.. నూటికి నూరుశాతం మంచిదని చెప్పలేం. ఆ వివరాలు మీ కోసం..
జీవనశైలి అలవాట్లతో పాటు ఇంకా చాలా కారణాలు వివిధ రకాల సమస్యలకు కారణమౌతుంటాయి. పీరియడ్స్ సమయంలో ఎదురయ్యే క్రాంప్స్, పీఎంఎస్, స్వెల్లింగ్ వంటి సమస్యలు నూటికి నూరుశాతం ఆరోగ్యానికి మంచిదని చెప్పలేం. ఫెర్టిలిటీ ఆరోగ్యం మన ఆరోగ్యం ఎలా ఉందనేది సూచిస్తుంది.
డీటాక్స్ డ్రింక్
లివర్ శరీరంలో అత్యంత కీలకమైన అంగం. రోజూ శరీరంలోని వ్యర్ధాల్ని బయటకు తొలగిస్తుంది. శరీరంలో వ్యర్ధాలు బయటకు పంపించడంలో విఫలమైతే..ఒక హార్మోన్ అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది మహిళల్లో పీరియడ్స్‌పై ప్రభావం చూపిస్తుంది. దీనికోసం డీటాక్స్ డ్రింక్స్ తీసుకోవాలి.
మానసిక ఆరోగ్యం
మహిళల్లో ఫెర్టిలిటీ, రుతుక్రమం ఆరోగ్యం కూడా చాలావరకూ మానసిక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. ఒత్తిడి రహితమైన సుఖమైన జీవితం ఉంటే..క్రాంప్స్, బ్లీడింగ్, పీఎంఎస్ వంటి లక్షణాలు దూరమౌతాయి.
ఏం చేయాలి, ఏం చేయకూడదు
హైడ్రోజనీకృత ఆయిల్ , విత్తనాలు, నట్స్ పరిమిత మోతాదులోనే తీసుకోవాలి. ఇందులో కొన్ని ఆరోగ్యమైనవే కానీ శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఇవి పీరియడ్స్ సైకిల్ కోసం మంచిది కాదు. ఈస్ట్రోజెన్ డీటాక్సిఫై చేసేందుకు రోజూ పచ్చి క్యారట్ సలాడ్ తీసుకోవాలి.
Also read; Diabetes Tips: చలికాలంలో డయాబెటిస్ ట్రిగ్గర్ కాకూడదంటే..ఈ పదార్ధాలు డైట్లో ఉండాల్సిందే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook