Paush Amavasya 2022 Date and Time: హిందూ మతంలో పుష్యమాసం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ మాసంలో వచ్చే అమావాస్యకు చాలా విశిష్టత ఉంది. దీనినే పౌష్ అమావాస్య లేదా పుష్య అమావాస్య (Paush Amavasya 2022) అంటారు. ఇది ఈ ఏడాది మరో మూడు రోజుల్లో అంటే డిసెంబరు 23, శుక్రవారం నాడు వస్తుంది. అంతేకాకుండా ఇదే రోజు కొన్ని శుభయాదృచ్ఛికాలు జరుగనున్నాయి. ఇది 5 రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజున మీరు తీసుకునే చర్యల వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతోపాటు పూర్వీకుల ఆశీర్వాదాలను కూడా పొందుతారు.
పౌష అమావాస్య నాడు శుభ యోగం
పౌష మాసం చిన్న పితృ పక్షంగా భావిస్తారు.ఈరోజున చేసే శ్రాద్ధ కర్మ, తర్పణం మరియు స్నాన-దానానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఈసారి పుష్య మాస అమావాస్య తిథి డిసెంబరు 22, రాత్రి 07.13 గంటలకు ప్రారంభమై.. 23 డిసెంబర్ 2022 మధ్యాహ్నం 03.46 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం, పౌష అమావాస్య డిసెంబర్ 23, శుక్రవారం జరుపుకుంటారు. ఇది లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేకమైన రోజు. అంతేకాకుండా ఇదే రోజు వృద్ధి యోగం కూడా ఏర్పడుతుంది. జాతకంలో పిత్రదోషం ఉన్నవారు పవిత్ర నదిలో స్నానం చేసి తర్పణం, పిండ ప్రదానం చేయడం వల్ల మీ జీవితంలో ఆనందం నెలకొంటుంది.
ఈ రాశుల వారికి పుష్య అమావాస్య శుభప్రదం
కర్కాటకం (Cancer): ప్రభుత్వ రంగానికి సంబంధించిన వ్యక్తులకు పురోభివృద్ధికి అవకాశం ఉంటుంది. డబ్బు లాభదాయకంగా ఉంటుంది.
కన్య (Virgo): కొత్త ఆలోచనలు వస్తాయి, వాటిపై పని చేయడం వల్ల మీకు ప్రయోజనం చేకూరుతుంది. మునుపటి కంటే మరింత ఎనర్జిటిక్ గా పని చేస్తారు. చుట్టూ సానుకూల వాతావరణం ఉంటుంది, ఇది మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది.
తుల (Libra): మీరు వ్యాపారంలో భారీగా లాభాలను ఆర్జిస్తారు. ఆగిపోయిన పని పూర్తి అవుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. వచ్చిన అవకాశాలను వృధా చేసుకోకండి.
వృశ్చికం(Scorpio): విద్యార్థులకు ఈ రోజు మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కలుగుతాయి. మీకు ఏవైనా అవకాశాలు వస్తే...వాటిని సద్వినియోగం చేసుకోండి, ఖచ్చితంగా లాభం పొందుతారు.
కుంభం (Aquarius): పాత వివాదాలు పరిష్కారమవుతాయి. సంబంధాలు మెరుగుపడతాయి. పరస్పర ప్రేమ పెరుగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. డబ్బు లాభదాయకంగా ఉంటుంది.
Also read: Shukra Gochar 2022: డిసెంబర్ 29న శుక్రుడి చివరి సంచారం.. ఈ 4 రాశుల వారి జీవితం అల్లకల్లోలం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook