ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సోషల్ మీడియా వేదిక ట్విట్టర్లో ఇటీవల చాలా మార్పులు జరుగుతున్నాయి. భారీ డీల్‌తో ట్విట్టర్‌ను చేజిక్కించుకున్న ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. బహుశా అందుకే యూజర్లకు అతనికే షాక్ ఇచ్చేశారు.
ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న తరువాత ఆ సంస్థకు సీఈవోగా వ్యవహరిస్తున్న ఎలాన్‌మస్క్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. భారత్ సహా వివిధ దేశాల్లో ట్విట్టర్ హెడ్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా సంస్థలో పనిచేస్తున్న సగం మందిని ఇంటికి పంపించేశాడు. ఆ తరువాత ట్విట్టర్ వెరిఫైడ్ ఖాతాలకు నెలనెలా డబ్బులు చెల్లించాలనే విధానం ప్రవేశపెట్టాడు. ఉద్యోగాల తొలగింపుపై ఇప్పటికే ఎలాన్‌మస్క్‌పై భారీగా విమర్శలు వచ్చాయి.
ఈ మధ్య వివిధ అంశాలపై యూజర్ల అభిప్రాయాల కోసం ట్విట్టర్లో పోల్ నిర్వహిస్తున్నాడు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను తిరిగి ట్విట్టర్లో తీసుకోవాలా వద్దా అనే విషయంపై పోల్ నిర్వహించినప్పుడు మెజార్టీ యూజర్లు తీసుకోవాలని ఓటింగ్ చేశారు. ఆ తరువాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై నిర్వహించిన పోల్ వివాదాస్పదమైంది.
ఇప్పుడు తాజాగా ట్విట్టర్ సీఈవోగా తాను కొనసాగాలా వద్దా అని తనకు తాను పోల్ నిర్వహించుకున్నాడు. ఈ పోల్‌పై యూజర్లు ఎలాన్‌మస్క్‌కు షాక్ ఇచ్చారు. మొత్తం 17 మిలియన్ల మంది యూజర్లలో 57.5 శాతం మంది వైదొలగాలని ఓటేశారు.
Also read: Share Market: పుంజుకున్న మార్కెట్, గ్రీన్ కలర్‌తో క్లోజ్ అయిన సెన్సెక్స్, నిఫ్టీలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook