School Girl dead body found in Dammaiguda pond: మేడ్చల్ జిల్లా నాగారం పరిధిలోని దమ్మాయిగూడ బాలిక మిస్సింగ్ కేసును శుక్రవారం జవహర్‌నగర్ పోలీసులు ఛేదించారు. 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని దమ్మాయిగూడలోని అంబేడ్కర్ నగర్ చెరువులో విగత జీవిగా పడిఉంది. బాలిక మృతదేహం చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అముతున్నారు. నిన్న స్కూల్‌కు వెళ్లిన బాలిక 26 గంటల తరువాత చెరువులో లభ్యం కావడంతో పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. బాలిక ఒంటిపై తీవ్ర గాయాలు ఉన్న నేపథ్యంలో.. ఇది హత్యే అని పోలీసులు అనుమానిస్తున్నారు.
జవహర్‌నగర్ పోలీస్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన 4వ తరగతి విద్యార్థిని (ఇందు) గురువారం ఉదయం 9 గంటలకు ఇంట్లోంచి స్కూలుకి వెళ్ళింది. తల్లిదండ్రులే బాలికను స్కూల్లో దింపి పనికి వెళ్లారు. 9.30 ప్రాంతంలో పాప కనిపించట్లేదని స్కూల్ టీచర్ తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. కంగారుపడి స్కూల్ దగ్గరకు వచ్చి చూడగా పాప బ్యాగు మాత్రమే ఉంది. చుట్టుపక్కల వెతికినా లాభం లేకపోయింది. దాంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సాయంత్రం వరకు కూడా పోలీసులు పాప ఆచూకీ కోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదు.
26 గంటలు దాటుతున్నా.. పాప ఎక్కడ ఉందో తెలియక పోవడంతో తల్లిదండ్రులు పోలీసులను నిలదీశారు. అప్పుడు పోలీసులు పాప ఆచూకీ కోసం చర్యలు వేగవంతం చేశారు. ఓ కెమెరాలో బాలిక కాలి నడకన వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. వాటి ఆధారంగా పోలీసులు బాలికను వెతగ్గా.. దమ్మాయిగూడలోని అంబేడ్కర్ నగర్ చెరువులో మృతదేహం లభ్యమైంది. పదేళ్ల పాప చెరువులో విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు. బాలికను ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేస్తున్నారు.
బాలిక ఒంటిపై తీవ్ర గాయాలు ఉన్నాయి. తల, నుదురు, నడుము భాగాలలో పెద్ద పెద్ద గాయాలు అయ్యాయి. బాలిక ఒంటిపై గాయాలు ఉండడంతో.. ఇది హత్యే అని పోలీసులు అనుమానిస్తున్నారు. బాలికను ఎవరైనా కిడ్నాప్ చేసి హతమార్చారా? లేదా బాలికపై ఏమైనా అఘ్యాయిత్యానికి ఈపని చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అసలు బాలిక స్కూల్‌కు వెళ్లి.. బ్యాగ్ పెట్టి ఎందుకు బయటకు వచ్చిందని తెలియరావడం లేదు. బాలికను ఎవరైనా రమ్మని పిలిచారా? అనే కోణంలో కూడా విచారణ చేపట్టారు.
Also Read: IND vs BAN: 25 ఏళ్ల తర్వాత.. రాహుల్ ద్రవిడ్‌కు అలన్ డొనాల్డ్ క్షమాపణలు! డిన్నర్‌కి కూడా పిలిచాడు
Also Read: Sun Transit 2022: నేడే త్రిగ్రాహి యోగం.. ఈ 5 రాశుల వారు అదృష్టవంతులు! లెక్కలేనంత డబ్బు మీ సొంతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
Dammaiguda Girl Missing: దమ్మాయిగూడ బాలిక మిస్సింగ్ కేసు.. చెరువులో మృతదేహం!
దమ్మాయిగూడ బాలిక మిస్సింగ్ కేసు
చెరువులో బాలిక మృతదేహం\
ఒంటిపై తీవ్ర గాయాలు