Tawang Border Issue : బార్డర్‌లో చైనా సైనికుల తుక్కురేగ్గొడుతున్న భారత ఆర్మీ.. రేణూ దేశాయ్ పోస్ట్ వైరల్

Renu Desai on Army ప్రస్తుతం చైనా ఇండియా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తవాంగ్‌లో చైనా సైనికుల తుక్కు రేగ్గొడుతూ ఇండియన్ ఆర్మీ ధైర్య సాహసాలను ప్రదర్శించడంపై రేణూ దేశాయ్ వీడియో షేర్ చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 14, 2022, 07:29 AM IST
  • సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు
  • చైనా సైనికుల కవ్వింపు చర్యలు
  • ఇండియన్ ఆర్మీ తెగింపుపై రేణూ దేశాయ్ వీడియో
Tawang Border Issue : బార్డర్‌లో చైనా సైనికుల తుక్కురేగ్గొడుతున్న భారత ఆర్మీ.. రేణూ దేశాయ్ పోస్ట్ వైరల్

Soldiers Beating at Tawang Border ఇండియా పక్కలో బల్లెంగా చైనా ఎప్పుడూ ప్రమాదకారి అన్న సంగతి మనకు తెలిసిందే. చైనా ఎప్పుడూ భారత్‌ను ఏదో ఒక రకంగా కవ్విస్తూనే ఉంటుంది. సరిహద్దు ఉల్లంఘనలు చేపడుతూనే ఉంటుంది. ఇది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. సరిహద్దుల్లో సైనికులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాల్సిందే. అయితే రెండేళ్ల క్రితం గాల్వన్ లోయ ఘటన దేశాన్ని కుదిపేసింది. చైనా దురాక్రమణను ఇండియన్ ఆర్మీ తిప్పి కొట్టేసింది. ఈ ఘటనలో భారత ఆర్మీ తన సైన్యాన్ని సైతం కోల్పోయింది.

మళ్లీ ఇప్పుడు అలాంటి పరిస్థితులే ఏర్పడేట్టు కనిపిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సరిహద్దు ప్రాంతంలో మళ్లీ చైనా, ఇండియా సైనికుల మధ్య యుద్ద వాతావరణం ఏర్పడింది. చైనా సైనికులు సరిహద్దులను దాటేశారు. దీంతో ఇండియన్ ఆర్మీ వారికి బుద్ది చెప్పింది. ఒక్కొక్కరి తుక్కు రేగ్గొట్టినట్టు కనిపిస్తోంది. దాదాపు మూడు వందల మంది సైనికులను వంది మంది ఇండియన్ సోల్జర్స్ అడ్డుగా నిలిచారు.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Abhishek Agarwal (@abhishekofficl)

ప్రస్తుతం ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అందరూ ఆ వీడియోను షేర్ చేస్తున్నారు. సెలెబ్రిటీలు సైతం ఆ వీడియోను షేర్ చేస్తున్నారు. అందులో రేణూ దేశాయ్ కూడా ఈ వీడియోను షేర్ చేసింది. ఇక ఆ వీడియోలో మన సైనికులు.. చైనా సైనికులను కర్రలో బాదేస్తున్నారు. బార్డర్ దాటకుండా అడ్డుకుంటున్నారు. అయితే ఈ వీడియో మీద మిశ్రమ స్పందన వస్తోంది. కొంత మంది ఇది పాత వీడియో అని అంటున్నారు. ఇది మోడీ ప్రభుత్వం.. గతంలోలా ఉండదు.. ఒక్క అడుగు ఇటు వైపు వస్తే ఇలానే ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు.

చైనా విదేశాంగ శాఖ, పీపుల్ లిబరేషన్స్ మాత్రం.. ఈ ఘటన మాత్రం భారత ఆర్మీ వల్లే జరిగిందని, భారత సైనికులే సరిహద్దుని దాటి, నియమాలను ఉల్లంఘించారంటూ, తప్పంతా మనదే అన్నట్టుగా ప్రెస్ నోట్ వదిలింది. మీడియాకు చెప్పింది. కానీ భారత ఆర్మీ మాత్రం.. చైనా సైనికులే బార్డర్ దాటారని, దాంతో ఇలాంటి పరిస్థితి నెలకొందని చెబుతోంది.

Also Read : China Army PLA: ఇండియన్ ఆర్మీపైనే నేరం మోపిన చైనా ఆర్మీ

Also Read : Amit Shah: మోదీ ఉన్నంత కాలం ఒక్క అంగుళం భూమి కూడా పోనివ్వం: హోంమంత్రి అమిత్ షా  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News