Rohit Sharma Miss 3rd Odi: ఎన్నో ఆశలతో బంగ్లాదేశ్ టూర్‌కు వెళ్లిన టీమిండియాకు వన్డే సిరీస్ చేదు అనుభవం మిగిల్చింది. సులభంగా సిరీస్ అప్పగిస్తుందనుకున్న బంగ్లాదేశ్ గొప్పగా పోరాడి భారత్‌ను రెండు వన్డేల్లో వరుసగా ఓడించింది. తొలి వన్డేలో ఒక వికెట్‌తో, రెండో మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో విజయం సాధించి.. మూడు వన్డేల సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన టీమిండియాకు మరో షాక్ తగిలింది. ముగ్గురు ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరం అయ్యారు.
భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. 'రోహిత్, కుల్దీప్ సేన్, దీపక్ చాహర్ మూడో మ్యాచ్‌లో ఆడరు. రోహిత్ ముంబైకి తిరిగి వచ్చి తన వేలికి గాయాన్ని స్పెషలిస్ట్‌కు చూపిస్తాడు. అతను టెస్టు సిరీస్‌లో ఆడగలడా లేదా అనేది మనం చెప్పలేని స్థితిలో లేము. మూడో వన్డే నుంచి ఈ ముగ్గురు ఆటగాళ్లకు మినహాయింపు. అయినా టీమిండియాకు ఎదురుదెబ్బ తప్ప ఏమీ కాదు..' అని తెలిపాడు.
బంగ్లాదేశ్ మ్యాచ్‌లో సెకెండ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ.. మహ్మద్ సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ నాలుగో బంతికి అనాముల్ హక్ క్యాచ్‌ను రోహిత్ జారవిడిచాడు. అతని ఎడమ చేతి బొటన వేలికి బంతి తగిలి రక్తస్రావమైంది. వెంటనే స్కానింగ్ కోసం ఢాకా ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి.. కుట్లు వేసి పంపించారు. రోహిత్ గాయంపై పూర్తి స్పష్టత రాకున్నా.. కోలుకోవడానికి కనీసం మూడు నుంచి నాలుగు వారాలు పట్టే అవకాశం ఉంది. టెస్టు సిరీస్‌కు హిట్‌మ్యాన్ దూరమైతే.. కేఎల్ రాహుల్ సారథ్య బాధ్యతలు అందుకుంటాడు.
దీపక్ చాహర్ ఔట్
పేస్ బౌలర్ దీపక్ చాహర్‌ను వరుసగా గాయాలు వెంటాడుతున్నాయి. రెండో వన్డేలో బౌలింగ్ చేస్తున్న సమయంలో 'హమ్ స్ట్రింగ్' బిగుతుగా ఉండటంతో మధ్యలోనే వెళ్లిపోయాడు. తన కోటాలో మూడు ఓవర్లు మాత్రమే వేశాడు. అతను గాయపడడం గత నాలుగు నెలల్లో ఇది మూడోసారి. హామ్ స్ట్రింగ్, వెన్ను నొప్పితో గత ఆరు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్‌లో కూడా ఆడలేకపోయాడు. ఇటీవలె రీఎంట్రీ ఇచ్చినా.. జింబాబ్వే టూర్‌లో ఇబ్బందిగానే కనిపించాడు. ఆ తరువాత దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ నుంచి గాయం నుంచి తప్పుకున్నాడు. ఆ తరువాత టీ20 ప్రపంచ కప్‌కు కూడా దూరమయ్యాడు.
కుల్దీప్ సేన్ కూడా దూరం
తొలి వన్డేలో అరంగేట్రం చేసిన ఫాస్ట్ బౌలర్ కుల్దీప్ సేన్ వెన్ను గట్టిపడటంతో రెండో వన్డేకు జట్టు నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు మూడో వన్డే నుంచి నిష్క్రమించాడు. మొదటి మ్యాచ్‌లోనే రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్న కుల్దీప్.. అనూహ్యంగా గాయం నుంచి దూరమవ్వడా అతని కెరీర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.
Also Read: Assembly Election Result 2022: నేడే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు.. గెలుపు ఎవరిది..?
Also Read: Rohit Sharma: రోహిత్ భయ్యా.. నీకు కుట్లు పడిన విషయం గుర్తుందా! నువ్ 'మగధీర'లో హీరో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి