Ind Vs Ban: బంగ్లాతో వన్డేకు ఓపెనర్‌గా ధావన్ ప్లేస్‌లో విధ్వంసకర ఆటగాడు.. రోహిత్ శర్మ ప్లాన్ అదే..!

Ind Vs Ban 2nd Odi Updates: బంగ్లాదేశ్‌తో రెండో వన్డే టీమిండియాకు కీలకంగా మారింది. మొదటి మ్యాచ్‌లో ఓడిపోవడంతో బుధవారం జరిగే వన్డే చావో రేవోగా మారింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోతే సిరీస్‌ బంగ్లాదేశ్ వశం అవుతుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 6, 2022, 07:43 AM IST
Ind Vs Ban: బంగ్లాతో వన్డేకు ఓపెనర్‌గా ధావన్ ప్లేస్‌లో విధ్వంసకర ఆటగాడు.. రోహిత్ శర్మ ప్లాన్ అదే..!

Ind Vs Ban 2nd Odi Updates: బంగ్లాదేశ్‌తో తొలి వన్డే ఓడిపోవడంతో.. రెండో వన్డే టీమిండియాకు డూ ఆర్ డై మ్యాచ్‌గా మారింది. వరుసగా రెండో వన్డే కూడా ఓడిపోతే భారత్ వన్డే సిరీస్‌ను కోల్పయినట్లే. ఈ నేపథ్యంలోనే ఈ మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఓపెనింగ్ కాంబినేషన్‌లో మార్పులు చేసే ఛాన్స్ ఉంది. కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్‌లో ఆడుతుండడంతో.. ధావన్ స్థానంలో ఇషాన్ కిషన్‌ను జట్టులో తీసుకువచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తొలి వన్డే మ్యాచ్ జరిగిన మీర్పూర్‌లోనే బుధవారం భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది.

రెండో వన్డేలో టీమిండియా ఓపెనింగ్ జోడీలో భారీ మార్పు చోటుచేసుకునే అవకాశం ఉంది. రెండవ వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మతో కలిసి యంగ్ బ్యాట్స్‌మెన్ ఓపెనర్ ఇషాన్ కిషన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌కు దిగవచ్చు. శిఖర్ ధావన్ వన్డేల్లో వరుసగా విఫలమవుతున్నాడు. వచ్చే వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని టీమ్‌ను సిద్ధం చేస్తున్న క్రమంలో ఇషాన్ కిషన్‌కు ఛాన్స్ ఇవ్వవచ్చు. ఈ యంగ్ ప్లేయర్‌కు తుది జట్టులో చోటు దక్కితే.. శిఖర్ ధావన్ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. 

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో శిఖర్ ధావన్ కేవలం 7 పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో దూకుడుగా ఆడేందుకు ఇషాన్ కిషన్‌ను రంగంలోకి దించాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ అయిన ఇషాన్ కిషన్ భారీ హిట్టింగ్‌కు మారుపేరు. ఒక్కసారి క్రీజ్‌లో కుదురుకుంటే.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ మ్యాచ్‌ని మలుపు తిప్పగల సామర్థ్యం ఉంది. 

శిఖర్ ధావన్ టీమ్ ఇండియాకు శుభారంభం ఇవ్వలేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇషాన్ కిషన్‌కు అవకాశం దొరికితే సత్తా నిరూపించుకునే ఛాన్స్ ఉంటుంది. వచ్చే ఏడాది 2023 వన్డే ప్రపంచకప్ భారత్‌లో జరగనుంది. ఇషాన్ కిషన్‌కు ఇప్పటి నుంచే వన్డే జట్టులో ఎక్కువ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఇషాన్ కిషన్ వంటి హిట్టింగ్ బ్యాట్స్‌మెన్ వన్డే జట్టులో రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ స్థానంలో స్థిరపడితే ఇక భారత్‌కు తిరుగుండదు.

Also Read: Adi Seshagiri Rao: వైసీపీ నుంచి బయటకు రావడానికి కారణం అదే.. సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు

Also Read: TS Eamcet: ఇంటర్మీడియట్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి ఫ్రీఎంసెట్ కోచింగ్ 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter,  Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x