Actor Chandramohan lost 100 Crores: అలనాటి మేటి నటుల్లో చంద్రమోహన్ కూడా ఒకరు. నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా సుమారు 1000కి పైగా సినిమాల్లో నటించిన ఆయన గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. తెలుగులో ఈ తరం వారందరికీ తండ్రి పాత్రలు చేస్తూ ఎక్కువగా నోటెడ్ అయిన ఆయన సుమారు నాలుగేళ్ల నుంచి తన నటన కెరీర్ కు గ్యాప్ ఇచ్చి ప్రస్తుతానికి రెస్ట్ తీసుకుంటున్నారు.
తాజాగా ఆయనని ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఆయన భార్య అయిన ప్రముఖ రచయిత్రి జలంధరను కూడా పలకరించారు. ఇక ఈ ఇంటర్వ్యూలో చంద్రమోహన్ భార్య జలంధర మాట్లాడుతూ చంద్రమోహన్ చేయి చాలా మంచిదని ఆయన చేతితో ఒక్క రూపాయి తీసుకున్నా కలిసొస్తుందని అంటూ ఉంటారని చెప్పుకొచ్చారు. అందుకే జనవరి ఒకటో తారీకు ఎంతోమంది ఆయనను కలిసి ఎందుకు వస్తారని అలా ఆయన చేత డబ్బు తీసుకొని వెళుతుంటారని చెప్పుకొచ్చారు.
ఆయన చేత్తోనే నాకు డబ్బు ఇవ్వడం వల్లే నాకు మంచి రచయిత్రిగా ఇంత పేరు వచ్చిందని ఆమె చెప్పడంతో పక్కనే ఉన్న చంద్రమోహన్ ఎమోషనల్ అయ్యారుఎం కన్నీరు వస్తుంటే తుడుచుకున్నాడు. ఇక ఇదే ఇంటర్వ్యూలో చంద్రమోహన్ తను సంపాదించి స్వయంగా పోగొట్టుకున్న ఆస్తుల గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నటుడు దివంగత గొల్లపూడి మారుతీరావు కొంపల్లి దగ్గరలో ఒక ద్రాక్ష తోట కొన్నప్పుడు తనను కూడా కొనమని చెప్పడంతో 35 ఎకరాలు కొన్నాను అని చెప్పారు. అయితే దాని మైంటైన్ చేయలేక అమ్మేశానని పేర్కొన్నారు.
అంతేకాక శోభన్ బాబు చెబుతున్నా వినకుండా మద్రాసులో 15 ఎకరాలు అమ్మానని ప్రస్తుతం ఆ భూమి విలువ 30 కోట్లు ఉంటుందని అన్నారు. అంతేకాక అప్పట్లో శంషాబాద్ మెయిన్ రోడ్డు దగ్గరలో ఆరెకరాల పొలం కొన్నానని అది కూడా అమ్మేశానని ఇప్పుడు అదే ప్రాంతంలో మంచి మంచి రిసార్టులు పెట్టారని అలా నేను నా అజాగ్రత్తతో దాదాపు 100 కోట్ల రూపాయలు దాకా పోగొట్టుకున్నానని సంపాదించిన వాటికంటే పోగొట్టుకున్నవే ఎక్కువ అని ఆయన కామెంట్ చేశారు. అంతేకాక చంద్రమోహన్ మాట్లాడుతూ నాకు అనేక ఇళ్లు ఉంటాయని ప్రచారం జరుగుతూ ఉంటుంది కానీ అదేమీ నిజం కాదని 20 శాతం నిజం ఉంటే దాన్ని 100% ఈ మీడియా వాళ్ళు వార్తలు సృష్టిస్తూ ఉంటారని ఆయన పేర్కొన్నారు.
Also Read: Nandini Rai : ఇంటిపైకెక్కి దూకాలనిపించేది.. వాళ్ల వల్లే బతికి బట్టకట్టా, నందిని సంచలనం!
Also Read: Rana Daggubati: ఇండియా ఎయిర్ లైన్స్ చెత్త.. ఇలాంటి సర్వీస్ ఎక్కడా చూడలేదంటున్న రానా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook