Ricky Ponting Hospitalised: ఆస్ట్రేలియన్ క్రికెట్ వరల్డ్ నుంచి ఓ పెద్ద షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆస్ట్రేలియా మాజీ గ్రేట్ బ్యాట్స్‌మెన్ రికీ పాంటింగ్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో పెర్త్‌లోని ఆసుపత్రిలో చేర్చారు. ఆస్ట్రేలియన్ మీడియా నివేదికల ప్రకారం, రికీ ఆరోగ్యం క్షీణించినప్పుడు పెర్త్‌లో జరుగుతున్న ఆస్ట్రేలియా vs వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్‌లో ఆయన కామెంటేటర్ గా వ్యవహరిస్తున్నారు. ఆస్ట్రేలియన్ వార్తాపత్రిక డైలీ టెలిగ్రాఫ్‌లో వచ్చిన కథనం ప్రకారం, పాంటింగ్ పరిస్థితి నిలకడగా ఉందని అతని సహాయకులు తెలిపారు.
ఇక రికీ అస్వస్థతతో ఉండడంతో ముందు జాగ్రత్తతో పరీక్ష కోసం ఆసుపత్రికి వెళ్లాడని అంటున్నారు. గుండె సంబంధింత సమస్య అంటున్నారు కానీ అది గుండె పోటా? లేక ఇంకేదైనా సమస్యనా? అనేది తెలియాల్సి ఉంది. అక్కడి నివేదికల ప్రకారం, పాంటింగ్‌ను మొదటి టెస్టు మూడో రోజు లంచ్ సమయంలో పెర్త్ ఆసుపత్రికి తీసుకెళ్లారట. దీంతో ఆయన మూడవ సెషన్లో వ్యాఖ్యానిస్తూ కనిపించడని అంటున్నారు. రికీ పాంటింగ్ అస్వస్థతతో ఉన్నారని, నేటి మ్యాచ్ కి ఆయన కామెంట్ చేయడం లేదని ఫాక్స్ స్పోర్ట్స్‌ని ఉటంకిస్తూ ఛానల్ సెవెన్ ప్రతినిధి తెలిపారు.
అక్కడి మీడియా నివేదికల ప్రకారం, పాంటింగ్ పరిస్థితి నిలకడగా ఉందని, ముందుగా తనకు అస్వస్తత అనిపించగానే అక్కడే ఉన్న తన సహోద్యోగులకు చెప్పాడు. కొన్ని లక్షణాల గురించి ఆందోళన చెందిన తరువాత, అతను టెస్ట్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇక పాంటింగ్ ఆరోగ్యం ఇలా అకస్మాత్తుగా క్షీణించడం షాక్ గు గురి చేసింది. ఎందుకంటే ఈ సంవత్సరం ఆస్ట్రేలియా యొక్క గొప్ప స్పిన్నర్ షేన్ వార్న్ థాయ్‌లాండ్‌లో గుండెపోటుతో మరణించాడు. పాంటింగ్ ఈ విషయంలో ఎలాంటి అజాగ్రత్త తీసుకోకూడదని అందుకే ఆసుపత్రికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడని అంటున్నారు. పాంటింగ్ ఆస్ట్రేలియా అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరిగా పరిగణించబడుతూ ఉంటారు. రికీ పాంటింగ్ కెప్టెన్సీలో, ఆస్ట్రేలియా జట్టు ODIలలో రెండుసార్లు (2003, 2007) ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది.
పాంటింగ్ కెరీర్:
పాంటింగ్ తన అంతర్జాతీయ కెరీర్లో 168 టెస్టులు, 375 వన్డేలు మరియు 17 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 13,378 పరుగులు, వన్డేల్లో 13,704 పరుగులు, టీ20ల్లో 401 పరుగులు చేశాడు. పాంటింగ్ టెస్టుల్లో 41 సెంచరీలు, 62 హాఫ్ సెంచరీలు, వన్డేల్లో 30 సెంచరీలు, 82 హాఫ్ సెంచరీలు, టీ20ల్లో రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు.
Also Read: Old Pension Vs New Pension Scheme: పాత పెన్షన్ విధానికి కొత్త పెన్షన్ పథకానికి తేడా ఇదే.. ఉద్యోగులకు ఏది బెటర్..?
Also Read: IPL 2023 Auction: ఐపీఎల్‌కు సీఎస్కే లెజెండ్ గుడ్ బై.. నిరాశలో చెన్నై ఫాన్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook