Tatti Annaram case : మొబైల్ ఫోన్స్ విద్యార్థులు, యువత మీద ఎంతలా ప్రభావం చూపిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొబైల్ ఫోన్ల వల్ల ఎంతో మంది చెడు ప్రభావానికి లోనవుతున్నారు. ఫోన్ల వల్ల ఉపయోగం ఎంతున్నా కూడా చెడు ఆలోచనలకు మాత్రం ఎక్కువగా ప్రభావితం చేసేలా ఉన్నాయి. హయత్ నగర్‌లోని తట్టి అన్నారంలో పదో తరగతి విద్యార్థినిపై తోటి విద్యార్థులు చేసిన అత్యాచార ఘటనలో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి.
ఈ అత్యాచారానికి పాల్పడిన విద్యార్థులు అసలు విషయాన్ని చెప్పారట. తండ్రికి తెలియకుండా అతని ఫోన్‌లో ఎప్పుడూ అశ్లీల వీడియోలు చూస్తుండేవారట ఆ విద్యార్థులు. అందులో చూపించినట్టుగానే చేయాలనే ఆలోచనలు వచ్చాయట. దీంతో సదరు విద్యార్థిని ఇలా అత్యాచారం చేసినట్టుగా విద్యార్థులు చెప్పుకొచ్చారట. పోలీసులు ఈ విషయం విని ఒక్కసారిగా ఖంగుతిన్నారట.
మొబైల్ ఫోన్స్ విద్యార్థులను ఎంతలా ప్రభావం చేస్తుందో ఈ ఘటన ఓ ఉదాహరణగా నిలుస్తోంది. అందుకే తల్లిదండ్రులు తమ తమ పిల్లలు, వారు ఫోన్లు వాడే తిరుపై కాస్త దృష్టిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ఘటనే ఓ ఉదాహరణగా నిలుస్తోంది. తోటి విద్యార్థిని పలుమార్లు అత్యాచారం చేసి, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చారు విద్యార్థులు. పదే పదే అత్యాచారం చేస్తుండటంతో సదరు విద్యార్థిని అసలు విషయం బయటపెట్టేసింది. దీంతో పోలీసుల వరకు వ్యవహారం వెళ్లింది. ఆ ఐదుగురు విద్యార్థులను కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
Also Read : Shruti Haasan Trolls : మేకప్ లేని ఫోటోపై ట్రోలింగ్..ఇక సమాజం ఎప్పటికీ మారదు.. శ్రుతి హాసన్ అసహనం
Also Read : Vijay Devarakonda ED : పాపులారిటీ ఉంటే ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి.. ఈడీ విచారణపై విజయ్ కౌంటర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook