Trendig Video: ఫిఫా వరల్డ్ కప్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ క్రేజ్ నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఓ వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పిల్లలు ఆడుకుంటున్నప్పుడు కొన్నిసార్లు కొన్ని జంతువులు మైదానంలోకి ప్రవేశిస్తే.. ఆ తర్వాత ఆటను ఆపాల్సి వస్తుంది. ఇలాంటి వీడియోలు చాలాసార్లు చూసి ఉంటారు. కానీ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో నవ్వుతెప్పిస్తోంది.
అకస్మాత్తుగా ఒక ఖడ్గమృగం ఫుట్‌బాల్ మైదానంలోకి ప్రవేశించింది. అది మైదానంలోకి వచ్చి గడ్డి తింటూ కనిపించింది. దీంతో మైదానంలో ఫుట్‌బాల్ ఆడుతున్న కొంతమంది ఆటగాళ్లు వచ్చి దానిని బయటకు పంపించేందుకు ప్రయత్నించారు. కానీ అది మాత్రం బయటకు వెళ్లేందుకు ఇష్టపడలేదు.
ఫుట్‌బాల్ మైదానంలోకి ఖడ్గమృగం ప్రవేశించడంతో ఫుట్‌బాల్ మ్యాచ్ నిలిపివేయాల్సి వచ్చింది. ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత్ నందా పోస్ట్ చేసిన వీడియోలో ఖడ్గమృగం పొలంలో నడుస్తూ పచ్చటి గడ్డిని తింటోంది. వీడియో ట్వీట్ చేస్తూ ఆయన.. సబ్‌స్టిట్యూట్‌ను అవుట్ చేయడానికి చాలా కష్టపడాలి అని రాసుకొచ్చారు. ఈ 18 సెకన్ల వీడియో రెండు రోజుల క్రితం షేర్ చేశారు. ట్విట్టర్‌లో దాదాపు 4 లక్షల మంది చూశారు. చివర్లో ఇద్దరు ఆటగాళ్లు ఖడ్గమృగంను మైదానం నుంచి బయటకు పంపించేందుకు ప్రయత్నించినా.. అది వెళ్లలేదు.
Trying hard to substitute the player pic.twitter.com/dTb3Sbr5Rd
— Susanta Nanda (@susantananda3) November 18, 2022
సోషల్ మీడియా యూజర్లు ఈ వీడియోను విపరీతంగా ఇష్టపడుతున్నారు. ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. వీడియో చూసిన తర్వాత.. 'ఖడ్గమృగాన్ని బయటకు నెట్టడానికి అతనికి ధైర్యం ఉందా.. చాలా ఆకలిగా ఉంది' అంటూ ఓ నెటిజన్ అన్నాడు. 'ఫుట్‌బాల్ మైదానంలో రిఫరీ రెడ్ కార్డ్ చూపించి ఉండాలి' అని మరో నెటిజన్ ఫన్నీగా రాశాడు. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా తరచుగా జంతువుల వీడియోలను షేర్ చేస్తుంటారు. ఈ వీడియో కొన్ని గంటల్లోనే వైరల్ అయింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి