Major accident on Pune-Bengaluru Highway: మహారాష్ట్రలోని పూణెలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూణె-బెంగళూరు హైవేపై నవాలే వంతెన (Navale bridge) వద్ద ఓ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో దాదాపు 48 వాహనాలు ధ్వంసమయ్యాయి. కనీసం 30 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పుణె అగ్నిమాపక దళం, పుణె మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి సంస్థ (PMRDA) అధికారులు రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
A major accident occurred at Navale bridge on the Pune-Bengaluru highway in Pune in which about 48 vehicles got damaged. Rescue teams from the Pune Fire Brigade and Pune Metropolitan Region Development Authority (PMRDA) have reached the spot: Pune Fire Brigade pic.twitter.com/h5Y5XtxVhW
— ANI (@ANI) November 20, 2022
ట్యాంకర్ బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్ల అది పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదం (Pune-Bengaluru highway Accident) కారణంగా ముంబైకి వెళ్లే రహదారిపై 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ప్రమాదం ఆదివారం రాత్రి సమయంలో జరిగింది. గత కొన్ని రోజులుగా నావెల్ బ్రిడ్జ్ ప్రమాదాల హాట్ స్పాట్‌గా మారుతోంది. శుక్రవారం ఔటర్ రింగ్ రోడ్డుపై వంతెన సమీపంలో వేగంగా వస్తున్న కారు ఢీకొని మహిళ మృతి చెందింది. ఈ పూణే రోడ్డుప్రమాదం వీడియోను చిత్రీకరించిన కొందరు ట్విట్టర్ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంశాఖమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లకు షేర్ చేశారు.
Also Read: Auto Rickshaw Blast: కదులుతున్న ఆటోలో మంటలు.. వెలుగులోకి షాకింగ్ విషయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి