Prasanna Kumar Clarity on Varasudu Sankranthi Release: సంక్రాంతి సమయంలో వారసుడు రిలీజ్ విషయం మీద తీవ్ర దుమారం రేగుతున్న పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వంశీ పైడిపల్లి డైరెక్టర్ గా విజయ్ హీరోగా రూపొందుతున్న వారిసు అనే సినిమాని తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ చేసేందుకు దిల్ రాజు ప్లాన్ చేసుకుంటున్నారు. నిజానికి అదే సంక్రాంతి సీజన్ కు బాలకృష్ణ వీర సింహా రెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
అదే సమయంలో తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీగా ఉన్న ప్రసన్న కుమార్ పేరుతో ఒక లేఖ విడుదలైంది. అందులో మొదటి ప్రాధాన్యతగా తెలుగు సినిమాలకే ఎక్కువ ధియేటర్లను కేటాయించాలని ఆయన ఎగ్జిబిటర్లను కోరారు. దానికి 2017 లోనే ఒక నిర్ణయం తీసుకున్నామని దానికి కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. అంతేగాక ఇదే నిర్ణయానికి దిల్ రాజు కూడా మద్దతు పలికారని 2019లో ఆయన ఇదే మాట మాట్లాడారని చెబుతూ లేఖ విడుదల చేయడం హాట్ టాపిక్ గా మారింది.
ఇదే విషయం మీద తమిళ దర్శకుల సంఘం ఒక మీటింగ్ పెట్టుకుని తమది పాన్ ఇండియా తమిళ్ మూవీ అని దాన్ని గనుక తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విడుదల చేయనివ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలుగు సినిమాలను తమిళంలో ఆడనివ్వమంటూ అర్థం వచ్చేలా డైరెక్టర్ లింగుస్వామి కామెంట్స్ చేశారు. ఈ వివాదం ముదురుతున్న నేపథ్యంలో ప్రసన్నకుమార్ పెదవి విప్పారు. తాము విడుదల చేసిన ప్రెస్ నోట్ లో మేము అందరినీ మొదటి ప్రాధాన్యతగా నేరుగా రూపొందించిన తెలుగు సినిమాలకే ఇవ్వాలని కోరామని డబ్బింగ్ సినిమాలను పక్కన పెట్టాలని కానీ వాటి ప్రాధాన్యత తగ్గించాలని కోరలేదని పేర్కొన్నారు.
బతకండి బతకనివ్వండి అనే విధంగా తాము కామెంట్ చేస్తే అది వేరే విధంగా బయటకు వెళ్లిందని ఆయన అన్నారు. ఇక సినీ పరిశ్రమంలో ఉన్న పెద్ద తలకాయలు ఈ రూల్స్ కనుక ఫాలో అవ్వకపోతే అది వారి ఇష్టమని ఇవన్నీ చూస్తున్న ప్రేక్షకులు వారికి ఎలా బుద్ధి చెప్పాలో వాళ్ళకి అలా బుద్ధి చెబుతారని ప్రసన్నకుమార్ చెప్పుకొచ్చారు. వారిసు సినిమా విషయానికి వస్తే దిల్ రాజు వంశీ పైడిపల్లి సహా సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్కరు ఇది ఒక తమిళ్ సినిమా అని అదే వంకతో తెలుగు సినిమాలు షూటింగ్స్ నిలిపివేసిన సమయంలో కూడా షూటింగ్స్ చేసుకున్నారని ప్రసన్నకుమార్ పేర్కొన్నారు.
తాము ముందు నుంచి చెబుతున్నది ఒకటేనని ఇప్పుడు అదే చెబుతున్నానని చెబుతూ డైరెక్ట్ తెలుగు సినిమాలుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పెద్ద పండుగల సమయంలో ఈ రూల్ కచ్చితంగా పాటించాల్సిందేనని పేర్కొన్నారు. తెలుగు సినిమాలకు సంబంధించిన థియేటర్స్ ఇవ్వడం పూర్తయిన తర్వాత అప్పుడు వారిసు, తునివు వంటి సినిమాలకు థియేటర్లు ఇవ్వాలని పేర్కొన్నారు. అయితే తెలుగు సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చిన మౌత్ టాక్ బట్టే చివరికి మిగతా సినిమాలకు థియేటర్లు పెంచాలా? తగ్గించాలా అనే విషయం ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Also Read: Rashmika Mandanna Hot Photos: రెడ్ గాగ్రా ఛోళీలో రష్మిక హాట్ ట్రీట్..ఎద అందాల విందు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook