King Cobra Attack on Men: ప్రపంచంలో ఉండే చాలా పాములు ప్రమాదకరమైనవి. వీటిల్లో కింగ్ క్రోబాలు అతి భయంకరమైనవి. వీటి కాటు వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు ప్రాణాంతకంగా మారే అవకావశాలున్నాయి. కాబట్టి ఈ కింగ్ కోబ్రాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అయితే కోబ్రాల్లో చాలా రకాలుంటాయి. అందులో కొన్ని గోధుమ రంగును కలిగి ఉంటే, మరి కొన్ని నలుపు రంగులో ఉంటాయి. ఈ పాముల్లో ఎక్కువగా నల్ల కింగ్ కోబ్రాలే మానవులకు హాని కలిస్తాయి. అంతేకాకుండా చాలా అరుదుగా ఎరుపు రంగు కోబ్రాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇది అమెరికా ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీటిల్లో ఉండే విషం చాలా ప్రమాదకరం. కాబట్టి తప్పకుండా వీటికి దూరంగా ఉండడం చాలా మేలు.
సోషల్ మీడియాల్లో ఎక్కువగా పాములకు, జంతువులకు సంబంధించిన వీడియోలే వైరల్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా బ్లాక్ కింగ్ కోబ్రాలకు సంబంధించిన చాలా వీడియోలు విచ్చల విడిగా నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. అయితే పాములను చూసి పరిగెత్తే వాళ్లు చాలా మందతే..వాటి పట్టుకుని సాహసాలు చేసే వారు చాలా తక్కువ మంది. ప్రమాదకరమైన పాములను పట్టుకుని వాటి కాటుకు గురై సోషల్ మీడియాలో కొందరు వైరల్‌గా మారుతున్నారు. ఇప్పుడు ఇలాంటి వీడియోలే సోషల్ మీడియాల్లో ట్రెండింగ్‌లో ఉంటున్నాయి.
మీరు ఈ వీడియోను గమనిస్తే ఓ వ్యక్తి పామును పట్టుకున్న సన్నివేశాలు చూడొచ్చు. అయితే ఆ వ్యక్తి నల్ల కింగ్ కబ్రాను పట్టు కోవడానికి ప్రయత్నించే సమయంలో పాము ఆ వ్యక్తి చేతును కాటేస్తుంది. దీంతో వ్యక్తి చేతిని ఒక్క సారి లాగుక్కుంటాడు. అయినప్పటికీ ఆ వ్యక్తి ఏ మాత్రం తగ్గకుండా మళ్లీ పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. అయితే మళ్లీ పాము ఆ వ్యక్తి తీవ్రంగా కాటేస్తుంది. అప్పుడు భయానకమైన సన్నివేశాలు మీరు చూడొచ్చు. ఆ కాటుతో వ్యక్తికి తీవ్ర రక్త స్త్రావం కూడా జరుగుతుంది. అయినప్పటికీ ఆ బ్లాక్ కోబ్రాను పట్టుకోవాలని చివరి ప్రయత్నం చేస్తాడు. దీంతో పాము ఆ వ్యక్తికి దోరకకుంగా పరిపోతుంది. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
వైరల్ అవుతున్న ఈ వీడియోను world_of_snakes అనే ఇంస్టాగ్రమ్ ఖాతా నుంచి షేర్ చేశారు. ఈ వీడియోను చూసిన చాలా మంది నెటిజన్లు తమ అభిప్రాయలను కామెంట్లలో షేర్ చేస్తున్నారు. అయితే ఇందులో ఉన్న అభిప్రాయాల్లో ఎక్కువగా ఈ సన్నివేశాలన్ని ఆందోళన కలిగించవేనని వారు తెలిపారు. అయితే ఈ వీడియోను ఇప్పటి వరకు 37 వేల మందికి పైగా వీక్షించగా చాలా మంది లైక్ చేశారు. అంతేకాకుండా షేర్ కూడా చేశారు.
Also Read: Post Office Scheme: ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టండి.. భారీ లాభం పొందండి
Also Read: Prince OTT: 'ప్రిన్స్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి