Delhi Municipal Corporation Elections: ఎవరైనా పార్టీ టికెట్ దక్కకపోతే మరో పార్టీలోకి జంప్ అవుతారు. లేదంటే పార్టీ ఆఫీస్ ముందు నుంచి కూర్చొని నిరసన వ్యక్తం చేస్తారు. మరికొందరు తమకు టికెట్ దక్కకుండా చేసిన వారిపై విమర్శలు గుప్పిస్తూ.. అధిష్టానానికి ఫిర్యాదు చేస్తారు. కానీ ఢిల్లోలో ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన తెలిపారు.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల అభ్యర్థుల రెండో జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ విడుదల చేసింది. మొత్తం 250 వార్డులకు ఆప్ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ ఎంసీడీ ఎన్నికల్లో ఆప్ చాలా మంది సిట్టింగ్ కౌన్సిలర్లకు టిక్కెట్లు నిరాకరించింది. దీంతో పాటు ఆ పార్టీ అభ్యర్థి కావాలని కలలు కంటున్న కొందరు నేతలకు టిక్కెట్లు దక్కలేదు.
ఈ నేపథ్యంలోనే తనకు టికెట్ దక్కలేదని ఆప్ కౌన్సిలర్ హైటెన్షన్ వైర్ టవర్ ఎక్కిన నిరసన తెలిపారు. ఇందుకు సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎంసీడీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ దక్కని ఆప్ కౌన్సిలర్ హసీబ్ ఉల్ హసన్ టవర్ ఎక్కి.. డబ్బులు తీసుకుని టిక్కెట్లు అమ్మకున్నారంటున్నారని ఆరోపిస్తూ హంగామా సృష్టించారు.
టవర్ ఎక్కి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు ఆప్ నేత. అధికార యంత్రాంగంతో సహా పెద్ద సంఖ్యలో ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకుని ఆయనను ఒప్పించే ప్రయత్నం చేశారు. తాను మాత్రం కిందకు దిగేది లేదంటూ హసీబ్ ఉల్ హసన్ స్పష్టం చేశారు. "నేను పార్టీ కోసం రాత్రింబవళ్లూ కష్టపడ్డాను. అయితే పార్టీ అధిష్టానం నాకు టికెట్ ఇవ్వలేదు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి పార్టీ అభ్యర్థిని ఓడిస్తా. అయితే తనను స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేయనీయకుండా తన పత్రాలు ఆమ్ ఆద్మీ పార్టీ తన వద్దే ఉంచుకుంది. నాకు చాలా బాధగా ఉంది.." అంటూ హసీబ్ ఉల్ హసన్ చెప్పుకొచ్చారు. అతను హంగామా సృష్టించడంతో ఆమ్ ఆద్మీ పార్టీ పత్రాలు తిరిగి వెనక్కి ఇస్తామని చెప్పింది. దీంతో హసీబ్ ఉల్ హసన్ కిందకు దిగి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ శుక్రవారం మొదటి జాబితాలో 134 మంది అభ్యర్థుల పేర్లను, శనివారం రెండవ జాబితాలో 116 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఈ జాబితాలో కూడా చాలా మంది పాత వారికే టిక్కెట్లు ఇచ్చారు. కొన్నిచోట్ల మాత్రం కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపింది. మొత్తం 250 సీట్లకు డిసెంబర్ 4న ఓటింగ్ నిర్వహించి, డిసెంబర్ 7న ఫలితాలు వెల్లడించనున్నారు.
Also Read: Pak Vs Eng Final: పాకిస్థాన్‌ను కట్టడి చేసిన బౌలర్లు.. ఇంగ్లాండ్‌కు ఈజీ టార్గెట్
Also Read: MS Dhoni: అమిత్ షాతో ధోని కరచాలనం.. బీజేపీలో చేరుతున్నాడంటూ ప్రచారం, ఫొటో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి