ఆధునిక జీవనశైలిలో వివిధ రకాల ఆహారపు అలవాట్లతో అనారోగ్య సమస్యలు ఎదుర్కోవల్సి వస్తోంది. రాత్రి వేళ ఎదురయ్యే కాళ్ల నొప్పి ఇందులో భాగమే. మరి ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలనేది తెలుసుకుందాం.
రోజంతా పని చేసి అలసిన తరువాత రాత్రి వేళ కాళ్ల నొప్పి సమస్య పీడిస్తుంటుంది. కొన్నిసార్లు నొప్పి తక్కువున్నా..ఇంకొన్నిసార్లు తీవ్రమౌతుంటుంది. ఫలితంగా రాత్రి నిద్ర కూడా సరిగ్గా ఉండదు. ఈ సమస్యకు సకాలంలో తగిన చికిత్స చేయించకుండా, నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. అందుకే సులభమైన 5 చిట్కాల్ని పాటిస్తే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
రోజూ యోగాతో కలిగే ప్రయోజనాలు
మీకు తరచూ కాళ్ల నొప్పి సమస్య బాధిస్తుంటే..రోజూ యోగా అలవాటు చేసుకుంటే మంచి ఫలితాలుంటాయి. ఇలా చేయడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగుపడుతుంది. యోగా ద్వారా కాళ్ల శక్తి పెరగడంతో చాలావరకూ నొప్పి తగ్గిపోతుంది. ఇతర సమస్యలు కూడా పోతాయి.
ఆవనూనెతో మాలిష్
కాళ్ల నొప్పి సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు రాత్రి పడుకునేముందు ఆవనూనెతో మాలిష్ చేస్తే మంచి ఫలితాలు కన్పిస్తాయి. దీనికోసం ఆవనూనెను గోరువెచ్చగా వేడి చేసి కాళ్లకు రాసి మాలిష్ చేయాలి. ఇలా చేయడం వల్ల కాళ్ల నొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
కాళ్ల నొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు వేడి నీటి కాపడం మంచి ఫలితాలనిస్తుంది. రాత్రి వేళ నిద్రపోయే ముందు నొప్పి ఉన్న భాగాల్లో హాట్ వాటర్ బ్యాగ్‌తో కాపడం పట్టాలి. ఇలా చేయడం వల్ల రక్త సరఫరా మెరుగై..నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
మెంతులతో ఉపశమనం
మెంతుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే కాళ్ల నొప్పి సమస్యకు మెంతులు అద్భుతంగా పనిచేస్తాయి. రాత్రి ఒక స్పూన్ మెంతుల్ని నానబెట్టాలి. ఉదయం మెంతులతో పాటు నీళ్లను రోజూ పరగడుపున తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కాళ్ల నొప్పి సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
యాపిల్ వెనిగర్, తేనెతో ప్రయోజనాలు
కాళ్ల నొప్పి సమస్య నుంచి గట్టెక్కేందుకు యాపిల్ వెనిగర్, తేనె మిశ్రమం మంచి ఫలితాల్ని ఇస్తుంది. ఎందుకంటే యాపిల్ వెనిగర్‌లో ఎనాల్జెసిక్ గుణాలున్నాయి. కాళ్లలో స్వెల్లింగ్, నొప్పిని తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడతాయి. చేయాల్సిందల్లా 2 స్పూన్స్ యాపిల్ వెనిగర్, సగం స్పూన్ తేనె కలిపి రోజూ పరగడుపున సేవించాలి. ఇలా చేస్తే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
Also read: Dengue Symptoms: డెంగ్యూ లక్షణాలు ఎలా ఉంటాయి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook