తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం అసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రేవంత్ కాంగ్రెస్ లో చేరుతున్నారనే ఊహాగానాలు వస్తున్న విషయం తెలిసెందే. ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చే విధంగా రేవంత్ రెడ్డి వ్యవహరించారు. వివరాల్లోకి వెళ్లినట్లయితే సీఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత కాంగ్రెస్ నేతలు బయటకు వచ్చే సమయంలో.. అసెంబ్లీ లోపలకి వెళుతున్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఎదురుపడ్డారు. అంతే ఒక్కసారిగా కాంగ్రెస్ నేతలు రేవంత్‌ను గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. కాంగ్రెస్ నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వగా, ఎమ్మెల్యే సంపత్ ఏకంగా ఆలింగనం చేసుకున్నారు.
ఇటీవలికాలంలో రేవంత్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవడం.... దీనిపై పార్టీ వివరణ కోరడం..దీనిపై స్పందించేందుకు రేవంత్ నిరాకరించడం వంటి వంటి పరిణామాలతో ప్రస్తుతం ఆయన్ను పార్టీ దూరంగా పెట్టింది. ఈ నేపథ్యంలో ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో కాంగ్రెస్ నేతలతో ఇలా హచ్ చల్ చేయడం గమనార్హం