England Captain Jos Buttler Says I Dont want to See Final Between India And Pakistan: టీ20 ప్రపంచకప్ 2022 చివరి అంకానికి చేరుకుంది. నేటి నుంచి సెమీ ఫైనల్ మ్యాచులు మొదలవనున్నాయి. బుధవారం మధ్యాహ్నం సిడ్నీ క్రికెట్ మైదానంలో జరిగే తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో పాకిస్తాన్ తలపడనుంది. అడిలైడ్ ఓవల్ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం రెండో సెమీ ఫైనల్లో భారత్, ఇంగ్లండ్ అమితుమీ తేల్చుకోనున్నాయి. సెమీస్ మ్యాచ్‌లలో గెలిచిన జట్లు ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో తలపడాయి. ఈ నెల 13వ తేదీన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
టీ20 ప్రపంచకప్ 2022 ఫైనల్లో భారత్, పాకిస్తాన్ తలపడుతాయని చాలామంది అంచనా వేస్తున్నారు. అయితే సెమీస్ మ్యాచ్‌లో టీమిండియాను ఓడించి.. తామే ఫైనల్ వెళుతామని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అంటున్నాడు. టీ20 ప్రపంచకప్ 2022 ఫైనల్లో భారత్, పాకిస్తాన్ తలపడకుండా అడ్డుకుంటామన్నాడు. రోహిత్ సేనను ఓడించేందుకు వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాం అని బట్లర్ టైలిపాడు. టీమిండియాతో సెమీస్ మ్యాచ్‌కు ముందు మీడియా సమావేశంలో పాల్గొన్న బట్లర్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
'భారత్, పాకిస్తాన్ జట్లను టీ20 ప్రపంచకప్ 2022 ఫైనల్లో చూడాలని మేము కోరుకోవడం లేదు. భారత్ ఫైనల్ ఆడకుండా మేము చేయగలిగినదంతా చేస్తాము. అయితే భారత్ చాలా బలమైన జట్టు. చాలా కాలంగా చాలామంది ప్లేయర్స్ నిలకడగా ఆడుతున్నారు. టీమిండియాలో సహజంగానే ప్రతిభ ఉంది. వారి బ్యాటింగ్ లైనప్‌లో అద్భుతమైన ఆటగాళ్ళు ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అన్ని షాట్లను ఆడతాడు. విరాట్ కోహ్లీ గురించి చెప్పేదేముంది. ఈ ఇద్దరినీ ఆపాల్సిన బాధ్యత నాపై ఉంది' అని బట్లర్ అన్నాడు.
'ఫిట్నెస్ సమస్యను ఎదుర్కొంటోన్న డేవిడ్ మలన్, మార్క్ వుడ్ గురించి ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేం. మ్యాచ్ రోజు వారిని తుది జట్టులోకి తీసుకోవాలా? వద్దా? అని చూడాలి. వారిద్దరూ మ్యాచ్ రోజుకు ఫిట్నెస్ సాధిస్తారని ఆశిస్తున్నా. భారత్‌ను ఎదుర్కొనడంలో కీలక పాత్ర పోషిస్తారని నమ్ముతున్నా. మ్యాచ్ గెలవాలంటే.. భువనేశ్వర్ కుమార్, మొహ్మద్ షమీ లాంటి టాప్ బౌలర్లను మేము ఎదుర్కోవాల్సి ఉంది' అని ఇంగ్లీష్ కెప్టెన్ చెప్పుకొచ్చాడు.
Also Read: IND vs ENG: డేవిడ్ మలన్ ఔట్.. సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసిన ఇంగ్లండ్! టీమిండియాకు చుక్కలే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి