ప్రస్తుత ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎదురౌతున్న ముఖ్యమైన అనారోగ్యాల్లో ఒకటి గుండెపోటు. ప్రాణాంతకమైన గుండెపోటు వచ్చేముందు కొన్ని సంకేతాలు తప్పకుండా ఇస్తుంది. ఆ వివరాలు మీ కోసం.
ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. గతంలో ఓ నిర్ణీత వయస్సు దాటిన తరువాతే గుండెపోటు సమస్య ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. చిన్న వయస్సుకే గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. గుండెపోటు వచ్చేముందు గుండెలో స్వెల్లింగ్ ప్రారంభమౌతుంది. దీనివల్ల శరీరంలోని బ్లడ్ సరఫరాపై ప్రభావం పడుతుంది. ఈ పరిస్థితిని వివిధ సంకేతాల రూపంలో మన శరీరం అలర్ట్ చేస్తుంది. ఈ లక్షణాల్ని సకాలంలో గుర్తించగలిగితే..వెంటనే చికిత్స సాధ్యమౌతుంది. లేకపోతే భారీ నష్టం ఎదుర్కోవల్సి వస్తుంది. ఆ లక్షణాలేంటి, గుండె స్వెల్లింగ్ ఎలా దూరం చేయాలో తెలుసుకుందాం..
పెరగనున్న హార్ట్ ఎటాక్ ముప్పు
గుండె స్వెల్లింగ్‌ను వైద్య పరిభాషలో మయో కార్డిసైటిస్ అంటారు. ఈ పరిస్థితిలో గుండె మజిల్స్‌లో స్వెల్లింగ్ ఏర్పడుతుంది. ఫలితంగా శరీరంలోని బ్లడ్ సరఫరాలో అంతరాయం కలుగుతుంది. ఫలితంగా బీపీ, హార్ట్ ఎటాక్, స్ట్రోక్, కార్డియాక్ అరెస్ట్ వంటి సమస్యలు ఎదురౌతాయి. ఈ ముప్పు పెద్దదే అయినా..లక్షణాల్ని సకాలంలో గుర్తించి చికిత్స ప్రారంభిస్తే మంచి ఫలితాలుంటాయి.
గుండెలో స్వెల్లింగ్ సమస్య లక్షణాలు
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం, ఛాతీలో నొప్పి రావడం, జ్వరం లేదా గొంతుల గరగర ఏర్పడటం కొన్ని ప్రధాన లక్షణాలు. తల తిరగడం, సొమ్మసిల్లినట్టుండటం, జాయింట్ పెయిన్స్, తలనొప్పి సమస్య, హార్ట్ బీట్ పెరగడం, అలసత్వం లేదా అలసటగా ఉండటం.
గుండెలో స్వెల్లింగ్ ఎందుకొస్తుంది
పెన్సిలిన్, సల్ఫోనమైడ్ వంటి యాంటీ బయోటిక్ మందులు తీసుకోవడం వల్ల గుండె స్వెల్లింగ్‌కు గురవుతుంది. ఫంగల్ కూడా మరో కారణం కావచ్చు. ఇక స్టెఫిలోకోకస్,స్టెప్టోకోకస్ వంటి బ్యాక్టీరియాలు కూడా గుండె స్వెల్లింగ్ కారకాలు. కరోనా, ఎడినోవైరస్ , హెపటైటిస్ వంటి వైరస్‌లు ఇతర కారణాలు
గుండె స్వెల్లింగ్ నుంచి ఎలా సంరక్షణ
రోజూ పరిమితంగా వ్యాయాయం తప్పకుండా చేయాలి. వ్యాధిగ్రస్థులకు దూరంగా ఉండాలి. శ్వాసకు సంబంధించిన వ్యాయామం లేదా యోగా తప్పకుండా చేయాలి. ఆరోగ్యకరమైన ఆహారమే తినాలి.
Also read: Ghee Remedies: గురక, జలుబు సమస్యల్ని ఇట్టే మాయం చేసే అద్భుతమైన చిట్కా ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Heart Swelling: హార్ట్ స్వెల్లింగ్ అంటే ఏమిటి, లక్షణాలెలా ఉంటాయి