Does and Donts in Lunar Eclipse 2022 Sutak Kaal: సూర్య గ్రహణం ముగిసి దాదాపు 15 రోజులు మాత్రమే అవుతొంది. అంతలోనే చంద్రగ్రహణం ఏర్పడనుంది. కార్తీక పౌర్ణమి నాడే (2022 నవంబర్ 8న) సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. భారత దేశంలో కూడా ఈ గ్రహణం కనిపిస్తుంది. 2022లో ఇదే చివరి చంద్రగ్రహణం. ఇదివరకు ఏప్రిల్‌లో ఒకసారి చంద్రగ్రహణం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ సంవత్సరం కార్తీక మాసంలో వరుసగా రెండు గ్రహణాలు రావడంతో.. వీటికి ప్రాధాన్యత పెరిగింది. కార్తీక అమావాస్య నాడు సూర్యగ్రహణం ఏర్పడితే.. పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడబోతోంది.
ఇది సంపూర్ణ గ్రహణం కాబట్టి చంద్రుడు పూర్తిగా భూమి నీడలో మునిగిపోతాడు. ఆ సమయంలో చంద్రుడు ఎర్రగా మారిపోతాడు. గ్రహణ కాల వ్యవధి 1 గంట 24 నిమిషాల 28 సెకన్లు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చంద్రగ్రహణం నవంబర్ 8న సాయంత్రం 5.09 నుంచి 6.19 వరకు ఉండనుంది. భారత దేశంతో పాటు ఆసియా, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలోని చాలా ప్రాంతాలలో ఈ చంద్రగ్రహణం కనిపిస్తుంది. హైదరాబాద్‌లో సాయంత్రం 5:40 సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది.
చంద్రగ్రహణం గ్రహణానికి 9 గంటల ముందు సూతకాలం ప్రారంభమవుతుంది. అంటే సూతకాలం ఉదయం 8.10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.19 గంటలకు ముగుస్తుంది. ఈ సమయంలో పూజలు మరియు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. గ్రహణ సమయంలో దేవాలయాల తలుపులు కూడా మూసివేస్తారు. గ్రహణ సమయంలో ఇంటి ఆలయంలో తలుపులు కూడా మూసివేయాలి. సూతకాలంలో ఏదైనా తినడం లేదా త్రాగడం చేయకూడదు. అదే సమయంలో తులసి ఆకులను వండిన ఆహారం లేదా పాలు లేదా పండ్లు మొదలైన వాటిలో వేయాలి.
చంద్రగ్రహణం ముగిసిన తర్వాతే ఆలయాల తలుపులు తెరుస్తారు. పూజారులు దేవాలయాలను శుద్ధిచేసి పూజ చేస్తారు. ఇంట్లో కూడా శుద్ధి అనంతరం పూజ చేయాలి. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి ఏదైనా వస్తువు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల గ్రహణం యొక్క ప్రతికూల ప్రభావం మనపై ఉండదు. చంద్రగ్రహణం కారణంగా కార్తీక పూర్ణిమ నాడు దేవ్ దీపావళి జరుపుకోరు. జ్యోతిష్యులు మరియు మత గురువుల ప్రకారం.. దేవ్ దీపావళిని ఒక రోజు ముందుగా నవంబర్ 7న జరుపుకుంటారు.
Also Read: మ్యాచ్ టర్నింగ్ పాయింట్.. దక్షిణాఫ్రికాను ముంచిన వాన్ డెర్ మెర్వ్ (వీడియో)!
Also Read: Virat Kohli: టీ20 ప్రపంచకప్ 2022ను భారత్ గెలిస్తే.. పెద్ద కేక్ కట్ చేస్తా: విరాట్ కోహ్లీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి