Virat Kohli Nominated for ICC Mens Player of the Month award for October 2022: అన్ని ఫార్మాట్లలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లను గుర్తించి.. గౌరవించడం కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 2021 జనవరిలో 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డుని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అక్టోబర్ నెల కోసం పురుషుల, మహిళల విభాగాల్లో నామినీల వివరాలను ఐసీసీ తాజాగా ప్రకటించింది. అక్టోబరులో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడిన విరాట్ కోహ్లీ, డేవిడ్ మిల్లర్, సికందర్ రజా ఈసారి పోటీలో ఉన్నారు.
టీ20 ప్రపంచకప్ 2022లో తన పునరాగమనాన్ని విరాట్ కోహ్లీ ఘనంగా చాటాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 82 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. ఆ తర్వాత నెదర్లాండ్స్‌పై (62 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పటివరకు ప్రపంచకప్‌లో 4 మ్యాచులు ఆడిన కోహ్లీ మూడు హాఫ్ సెంచరీలతో 220 రన్స్ చేశాడు. మొత్తంగా అక్టోబరులో టీ20ల్లో కోహ్లీ 205 పరుగులు చేశాడు. కోహ్లీ సగటు 205 కాగా.. స్ట్రైక్ రేట్ 150.73గా ఉంది. కోహ్లీ ఈ అవార్డుకి నామినేట్ కావడం ఇదే మొదటిసారి.
ఇటీవలి కాలంలో మంచి ఫామ్‌లో ఉన్న డేవిడ్ మిల్లర్.. అక్టోబరు నెలలో రెచ్చిపోయాడు. భారత్‌లో జరిగిన టీ20 సిరీస్ మ్యాచ్‌లో 47 బంతుల్లోనే 106 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక మెగా టోర్నీలో భారత్‌తో పెర్త్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 59 పరుగులతో అజేయంగా నిలిచాడు. అక్టోబరులో మిల్లర్ 303 సగుటు, 146.37 స్ట్రైక్ రేటుతో 303 పరుగులు చేశాడు. జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా.. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 47 బంతుల్లో 82 పరుగులు చేశాడు. స్కాట్లాండ్పై కూడా 40 పరుగులు బాదాడు. అదే సమయంలో 5 వికెట్లు తీసుకున్నాడు.
అక్టోబర్ నెలకు ఐసీసీ విమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం భారత మహిళల క్రికెట్ టీం నుంచి జెమీమీ రోడ్రిజ్, దీప్తి శర్మ.. పాకిస్తాన్ జట్టు నుంచి నిడా దార్ నామినేట్ అయ్యారు. ఏ అవార్డుని ఇప్పటివరకు నలుగురు భారత ఆటగాళ్లు గెలిచారు. రిషబ్ పంత్, ఆర్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, శ్రేయాస్ అయ్యర్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్నారు.
Also Read: Amala Paul Hot Pics: ఆకుల చాటున అందాలు దాచిన అమలా పాల్.. చూపించి చూపించినట్టుగా..!
Also Read: కోహ్లీ గణాంకాలు చూస్తే చిత్రంగా అనిపిస్తోంది.. ఊహకే అందడంలేదు! వాట్సన్ ఆశ్చర్యం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook