Multibagger stocks: షేర్ వంద రూపాయలే..కానీ 5 కోట్లుగా మారిన లక్ష రూపాయలు

Multibagger stocks: షేర్ మార్కెట్‌లో చాలా షేర్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని షేర్లు ఊహించని లాభాల్ని తెచ్చిపెడుతుంటాయి. ఇవే మల్టీబ్యాగర్ స్టాక్స్. ఇన్వెస్టర్లకు అద్భుతమైన రిటర్న్స్ ఇస్తుంటాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 30, 2022, 05:23 PM IST
Multibagger stocks: షేర్ వంద రూపాయలే..కానీ 5 కోట్లుగా మారిన లక్ష రూపాయలు

షేర్ మార్కెట్ అంటేనే ఓ వింత ప్రపంచం. ఎప్పుడు ఏ కంపెనీ షేర్ ఎలా మారుతుందో అర్ధం కాని పరిస్థితి. ఊహించని లాభాల్ని ఇచ్చే షేర్లను షేర్ మార్కెట్ పరిభాషలో మల్టీబ్యాగర్ స్టాక్స్‌గా పిలుస్తారు. 

షేర్ మార్కెట్‌లో కొన్ని షేర్లు ఇన్వెస్టర్లకు భారీ లాభాల్ని ఇస్తుంటాయి. ఫలితంగా స్వల్పకాలంలో ఇన్వెస్టర్లు కోటీశ్వరులైపోతుంటారు. ఇన్వెస్టర్లకు పలు రెట్ల లాభాలిచ్చే షేర్లనే మల్టీబ్యాగర్ స్టాక్స్ అంటారు. ఇలాంటి మల్టీబ్యాగర్ స్టాక్ ఇప్పుడు శరవేగంగా వృద్ధి చెందుతూ..ఇన్వెస్టర్లకు లాభాలు ఆర్జిస్తోంది. ఆ కంపెనీ Bharat Electronics Ltd. ఈ కంపెనీ షేర్ ఇన్వెస్టర్లను తక్కువకాలంలోనే ధనవంతులు చేసింది. కొంతమంది కోటీశ్వరులైపోయారు కూడా. ఒకప్పుడు కేవలం 1 రూపాయి ఉన్న ఈ షేర్ ఇప్పుడు 100 రూపాయలు దాటేసింది.

1999 జనవరి 1వ తేదీన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ షేర్ క్లోజింగ్ ధర ఎన్ఎస్ఈలో 22 పైసలు మాత్రమే. 1999 ఫిబ్రవరిలో క్లోజింగ్ ధర 18 పైసలకు పడిపోయింది. ఆ తరువాత 1999 జూన్ 4వ తేదీకు 29 పైసలైంది. నెమ్మెదిగా ఈ కంపెనీ షేర్ పెరగసాగింది. 2000 సంవత్సరం ఫిబ్రవరిలో 1 రూపాయికి చేరుకుంది.

తిరిగి 2005లో తొలిసారి ఈ కంపెనీ షేర్ 10 రూపాయలైంది. ఇప్పుడు మాత్రం ఈ కంపెనీ షేర్ ధర 100 రూపాయలు దాటేసింది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 52 వారాల గరిష్ట ధర ఆల్ టైమ్ హై 114.65 రూపాయలుంది. అటు 52 వారాల కనిష్ట ధర 61.15 రూపాయలు మాత్రమే. అక్టోబర్ 28వ తేదీన ఈ కంపెనీ షేర్ 105.30 రూపాయలుంది.

ఒకవేళ అప్పట్లో ఎవరైనా అంటే 1999లో షేర్ ధర 20 పైసలున్నప్పుడు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టుంటే..5 లక్షల షేర్లు లభించేవి. ఇప్పుడు షేర్ ధర 100 రూపాయలు కావడంతో 5 లక్షల షేర్ విలువ లెక్కేస్తే..5 కోట్లకు చేరుకుంది. అంటే 1999లో లక్ష రూపాయల పెట్టుబడి 5 కోట్లుగా మారిపోయింది. 

షేర్ మార్కెట్‌లో నిశిత పరిశీలన చాలా అవసరం. నిశితంగా పరిశీలిస్తూ..మార్కెట్ పరిస్థితులు, పరిణామాలు పరిగణలో తీసుకుంటూ సరైన షేర్లను ఎంచుకుంటే కచ్చితంగా లాభాలు ఆర్జించవచ్చంటారు మార్కెట్ నిపుణులు. కొన్ని షేర్లను స్వల్పకాలానికి పరిమితం చేయాల్సి వస్తే..మరి కొన్ని షేర్లను దీర్ఘకాలానికి లిస్ట్ చేసుకోవాలి. మార్కెట్ పరిస్థితులకు అనుకూలంగా పెట్టుబడులు పెడితే..షేర్ మార్కెట్‌లో మీరు కూడా సంపాదించవచ్చు.

Also read: Amazon Mobile Offers: ఆఫర్ల ఇంకా మిగిలున్నాయి, 25 వేల స్మార్ట్‌ఫోన్ కేవలం 3 వేలకే మీ సొంతం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News