బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మె రెండోరోజు కూడా కొనసాగుతోంది. గురువారం కూడా ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో బ్యాంకు సేవలు స్తంభించాయి. ఈ సమ్మె శుక్రవారం ఉదయం 6 గంటల వరకు ఈ సమ్మె కొనసాగనుంది. కాగా తొలి రోజు చేపట్టిన సమ్మె తో దేశవ్యాప్తంగా అనేక బ్యాంకుల సేవలు నిలిచిపోయాయి. దీంతో వ్యాపార లావాదేవీలు నెమ్మదించాయి. దీంతో సామాన్య జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్య, చిన్న తరహా పరిశ్రమల ఆదాయంపై సమ్మె తీవ్ర ప్రభావం చూపింది.
బుధవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈ సమ్మె శుక్రవారం ఉదయం 6 గంటలతో ముగియనుంది. వేతన సవరణ డిమాండ్‌తో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. కేవలం 2శాతం వేతన పెంపు మాత్రమే చేయడాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకు సిబ్బంది రెండు రోజుల సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే.
ఉద్యోగుల సమ్మె సక్సెస్
- బ్యాంకు ఉద్యోగుల సమ్మెలో అన్ని బ్యాంకులు, బ్రాంచీల్లోని ఉద్యోగులు ఉత్సాహంగా సమ్మెలో పాల్గొన్నారని.. ఇది విజయవంతమైందని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకింగ్ యూనియన్స్ తెలిపింది.
- బ్యాంకు ఉద్యోగుల సమ్మెలో 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 13 ప్రైవేటు రంగ బ్యాంకులు, ఆరు విదేశీ బ్యాంకులు, 56 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లోని 10 లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నట్లు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రకటించింది.