Samantha Ruth Prabhu Myositis Diseases : సమంత తాజాగా తన వ్యాధి గురించి అందరికీ చెప్పేసింది. యశోద సినిమా ట్రైలర్‌కు వచ్చిన ఇచ్చిన రెస్పాన్స్ చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. అదే మీకు, నాకు మధ్య ఉన్న బంధం. అదే ప్రేమతో నేను ఈ కష్టాలన్నింటిని ఎదుర్కొంటున్నాను. నా మీద విసిరే రాళ్లను కూడా తట్టుకుంటున్నాను. మ్యూసిటిస్ (కండరాల బలహీనత, ఎక్కువ సేపు నిల్చోలేకపోవడం నడవ లేకపోవడం, నీరసంగా ఉండటం దాని లక్షణాలు) అనే వ్యాధితో బాధపడుతున్నాను. ఇదంతా మీకు చెప్పాలని అనుకున్నాను.
కానీ కాస్త ఆలస్యంగా చెబుతున్నాను. అయితే మనం ప్రతీదీ ఇలా బయటకు వచ్చి చెప్పాల్సిన పని లేదని నేను అనుకుంటున్నాను. మనకు ఎదురయ్యే సవాళ్లను అంగీకరిస్తూ ముందుకు వెళ్లాల్సిందే. త్వరలోనే కోలుకుంటానని వైద్యులు చెప్పారు. మానసికంగా, శారరీకంగా నేను ఎన్నో కష్టాలను చూశాను.. ఇక ఇవి నేను భరించలేననేంత స్థాయిలోనూ కష్టాలు వచ్చాయి.. కానీ అవన్నీ ఎలాగో గడిచిపోయాయి. ఇక ఇది కూడా త్వరలోనే సమసిపోతుందని ఆశిస్తున్నాను అని సమంత చెప్పుకొచ్చింది.
ఇక సమంత ఇన్ని రోజులు బయటకు రాకపోవడానికి కారణం, సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి గల కారణం అందరికీ తెలిసి వచ్చింది. ఇన్ని రోజులు సమంతకు స్కిన్ డిసీజ్ వచ్చిందని, సర్జరీ చేసుకుందని, అందుకే బయటకు రాలేదని అందరూ అనుకున్నారు. కానీ అసలు విషయం మాత్రం ఇప్పుడు సమంత చెప్పేసింది. ఇక సమంత వేసిన ఈ పోస్ట్ చూసి అభిమానులు కంగారు పడుతున్నారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండని సమంతకు సూచిస్తున్నారు. నువ్వో అద్భుతం అంటూ శ్రియా కామెంట్ పెట్టేసింది. పాపా లవ్యూ అని నీరజ కోన స్పందించింది.
సమంత యశోద సినిమా ప్రమోషన్స్ కోసమైన బయటకు వస్తుందా? లేదా? అన్నది చూడాలి. త్వరలోనే తన వ్యాధి తగ్గిపోతుందని వైద్యులు చెప్పారట. మరి ఒక వేళ పూర్తిగా తగ్గితే యశోద ప్రమోషన్స్‌లో సమంత కనిపిస్తుంది. లేదంటే పరిస్థితి ఇంకో రకంగా ఉంటుంది. సమంత లేకుండా యశోద సినిమా రిలీజ్ అవుతుందుమో చూడాలి.
Also Read : ఊహించని ఎలిమినేషన్... రిస్క్ తీసుకోలేకే ఆ కంటెస్టెంట్ ను సాగనంపిన బిగ్ బాస్
Also Read : Nithya Menen Pregnancy : నాలుగు సార్లు టెస్ట్ చేసుకున్నా.. పాజిటివ్ వచ్చింది.. నిత్యా మీనన్ వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook