DA Hike For Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్.. ఒకేసారి భారీ మొత్తం ఖాతాల్లోకి..!

DA Hike of Central Govt Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జాక్ పాట్ కొట్టేశారు. ఒకేసారి భారీ మొత్తంలో నగదు జమ కానుంది. ఇప్పటికే కొందరి అకౌంట్‌లో పడిపోగా.. మరి కొందరికి అక్టోబర్ నెల జీతంతో పాటు ఇవ్వనున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 29, 2022, 03:07 PM IST
DA Hike For Employees: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్.. ఒకేసారి భారీ మొత్తం ఖాతాల్లోకి..!

DA Hike of Central Govt Employees: కేంద్ర ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్‌ను పెంచుతున్నట్లు ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను హాఫ్ ఇయర్ ప్రాతిపదికన సంవత్సరానికి రెండుసార్లు పెంచుతుంది. ఇలా ప్రతి ఏడాది జనవరి, జూలై నుంచి వర్తిస్తుంది. అయితే కొన్ని కారణాల వల్ల సాధారణంగా మార్చి, సెప్టెంబర్‌లో ప్రకటిస్తారు. ఈసారి కూడా జూలై 1, 2022 నుంచి రావాల్సిన కొత్త డీఏ దీపావళి పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఈసారి డియర్‌నెస్ అలవెన్స్‌ను 4 శాతం పెంచారు. దీంతో 34 శాతం నుంచి 38 శాతానికి డీఏ పెరిగింది. ఉద్యోగులకు కూడా 38 శాతం చొప్పున డీఏ చెల్లిస్తున్నారు. సెప్టెంబర్‌లో ప్రకటించిన ప్రకటన ప్రకారం లక్షల మంది ఉద్యోగులకు మూడు నెలల డీఏ బకాయిలు వచ్చాయి. కొంతమంది ఉద్యోగులకు సెప్టెంబర్ నెల జీతంతోపాటు చెల్లించారు. కొందరికి అక్టోబరు నెల జీతంలో కలిపి వేస్తారు. జూలె నెల నుంచి డీఏలు వర్తించనున్నాయి.

అయితే డీఏ పెరగడం వల్ల ఎవరికి ఎంత జీతం అందుతుందో తెలుసా..? మీరు కింద ఉన్న ఒకసారి డీఏ హైక్ టేబుల్ చూడండి. లెవల్-1 నుంచి లెవల్-4 వరకు వేర్వేరు చార్ట్‌లు ఉన్నాయి. ఇక్కడ రూ.18 వేలకు, 56900 రూపాయల ప్రాథమిక జీతానికి లెవెల్-1లో డీఏలో ఎంత తేడా ఉందో చూడొచ్చు. అదేవిధంగా బేసిక్ శాలరీ రూ.19900 నుంచి రూ.63200 మధ్య డీఏ అలెవెన్స్‌ను లెవెల్-2లో గమనించవచ్చు. 

DA Hikes Table

లెవెల్-3లో రూ.21700 నుంచి 69100 వరకు బేసిక్ జీతం ఉన్న ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ చార్ట్ ఉంది. లెవెల్-4లో రూ.25500 బేసిక్ వేతనం ఉన్న ఉద్యోగులకు డీఏను రూ.81100కి పెంచారు. ఇక మరో డీఏను మార్చి 2023లో ప్రకటించే అవకాశం ఉంది. ఇది 1 జనవరి 2023 నుంచి వర్తిస్తుంది. ఈ డీఏలో 3 నుంచి 5 శాతం పెంపు ఉంటుందని అంచనా.  

DA Hikes Table
 

Also Read: Future Investment Plan: రోజుకు రూ.17 పెట్టుబడి పెడితే కోటీశ్వరులవుతారు.. ఎలాగో తెలుసుకోండి  

Also Read: MP Raghu Rama Krishnam Raju: ఆర్జీవీ 'వ్యూహం' మూవీకి కౌంటర్.. గండ్ర గడ్డలి, కోడి కత్తి సినిమా వస్తాయి: ఎంపీ రఘురామ   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News