Mercury Transit 2022: ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల యువరాజు అని పిలుస్తారు. అలాంటి బుధుడు రేపు అంటే అక్టోబర్ 26న తులారాశిలోకి (Mercury Transit in Libra 2022) ప్రవేశించనున్నారు. దీని ప్రభావం మెుత్తం 12 రాశులవారిపై ఉంటుంది. అదే రాశిలో బుధుడు నవంబరు 19 వరకు ఉండనున్నాడు. బుధుడి సంచారం కొన్ని రాశులవారికి శుభప్రదంగానూ, మరికొన్ని రాశులకు అశుభకరంగానూ ఉంటుంది. తెలివితేటలు, తర్కం, కమ్యూనికేషన్ కు కారకుడు బుధుడు. అలాంటి బుధుడి సంచారం ఏ రాశివారికి శుభప్రదంగా ఉండనుందో తెలుసుకుందాం.
బుధుడి సంచారం ఈ రాశులకు లాభదాయకం
సింహం (Leo): బుధ గ్రహం తులారాశిలోకి ప్రవేశించిన తర్వాత సింహ రాశి వారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య అనురాగాలు, అప్యాయతలు పెరుగుతాయి. ఆఫీసులో మీరు మంచి బెనిఫిట్స్ పొందుతారు. సమాజంలో మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి.
ధనుస్సు రాశి (Sagittarius): బుధుడు రాశి మార్పు ధనుస్సు రాశి వారిపై మంచి ప్రభావం చూపుతుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ధనం లాభదాయకంగా ఉంటుంది. ఎక్కడైనా చిక్కుక్కున్న డబ్బు, అప్పుగా ఇచ్చిన డబ్బు మీ వద్దకు తిరిగి వస్తుంది.ఈ సమయంలో మీరు శుభవార్త వినే అవకాశం ఉంది.
మిధునరాశి (Gemini): మిథునరాశి వారిపై బుధ సంచారం సానుకూల ప్రభావం చూపుతుంది. ఆఫీసులో మీరు ఉన్నత స్థాయికి వెళ్లడానికి అవకాశాలు పెరుగుతాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
కర్కాటకం (Cancer): బుధుడు తులారాశిలోకి ప్రవేశించినప్పుడు కుటుంబ జీవితంలో శాంతి నెలకొంటుంది. ధనలాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తుల ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. విద్యార్థులు విద్యారంగంలో రాణిస్తారు. వ్యాపారస్తులు పెద్ద పెద్ద డీల్స్ కుదుర్చుకోవచ్చు.
Also Read: Shani Gochar 2022: మకరరాశిలో శనిదేవుడు కదలిక.. 24 గంటల్లో ధనవంతులు అవ్వనున్న ఈ 4 రాశులవారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook