Common Man Rights at Petrol Pump: పెట్రోల్ బంకుల్లో మోసాలకు ఇటీవల అడ్డు అదుపూ లేకుండా పోతున్న విషయం తెలిసిందే. అనేక పెట్రోల్ బంకుల యాజమాన్యాలు నకిలీ చిప్‌లు అమరుస్తూ.. వాహనదారులను నిలువునా దోచుకుంటున్నాయి. ఉదాహరణకు.. లీటర్ పెట్రోల్ పోయిస్తే 800 మి.లీ మాత్రమే ట్యాంక్ పడుతుంది. మిషన్‌లో మాత్రం లీటర్ అని చూపిస్తుంది. అలా రీడింగ్ చూపేంచేలా కొన్ని పెట్రోల్ యాజమాన్యాలు నకిలీ చిప్స్‌ను సెట్ చేస్తున్నాయి. ఇలా అయితే ఎవరికి అనుమానం రాదని వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. అనేక చోట్ల వాహనదారులు తిరగబడిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. పెట్రోల్ తక్కువగా వచ్చిందని.. నీళ్లు వస్తున్నాయని.. నాణ్యతగా లేదంటూ పెట్రోల్ బంక్ సిబ్బందితో వాహనదారులు గొడవకు దిగడం చూసే ఉంటారు. మరి పెట్రోల్ బంకుల్లో మోసాలకు ఎలా చెక్ పెట్టాలి..? ఎలా తప్పించుకోవాలి..? పెట్రోల్ బంకుల్లో వాహనదారులకు ఉండే హక్కులు ఏంటి..?
పెట్రోల్ లేదా డీజిల్ నాణ్యతను తనిఖీ చేసే హక్కు వాహనదారులకు ఉంటుంది. నాణ్యతను చెక్ చేయడానికి ఫిల్టర్ పేపర్ టెస్ట్ కోసం పెట్రోల్ పంప్‌లోని మేనేజర్ లేదా సిబ్బందిని అడగవచ్చు. మీకు సరైన మొత్తంలో పెట్రోల్ లేదా డీజిల్ ఇస్తున్నారా.. లేదా..? అని మీరు చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఎలాంటి రుసుము వసూలు చేయరాదు. ప్రతి పెట్రోల్ పంపులో పెట్రోల్ లేదా డీజిల్ పరిమాణాన్ని కొలవడానికి 5 లీటర్ల జార్ ఉంచాలి. మీ ట్యాంక్‌లో పెట్రోల్ క్వాంటీటిని చెక్ చేసుకుని మోసాలకు దూరంగా ఉండవచ్చు.
పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలు చేసిన తరువాత బిల్ ప్రింట్ తీసుకునే హక్కు వాహనదారులకు ఉంటుంది. మీరు కొనుగోలు చేస్తున్న పెట్రోల్ లేదా డీజిల్ సాంద్రత గురించి కూడా తెలుసుకోవచ్చు. అది పెట్రోల్ వెండింగ్ మెషిన్‌పై కూడా రాసి ఉంటుంది.
అంతేకాకుండా పెట్రోల్ బంకుల్లో కొన్ని ఉచిత సేవలను పొందొచ్చు. కచ్చితంగా స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో ఉంచాలి. తాగునీటి సౌకర్యం లేకపోతే.. చమురు మార్కెటింగ్ సంస్థకు కంప్లైంట్ చేయవచ్చు. వాహనాల టైర్లలో ఉచితంగా గాలి నింపాలి. ప్రథమ చికిత్స పెట్టెను అందుబాటులో ఉంచాలి. పరిశుభ్రమైన మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలు చేస్తున్న దాంట్లో 4 నుంచి 8 పైసల వరకు వీటి నిర్వహణకు చెల్లిస్తున్నారు. అదేవిధంగా అత్యవసర సమయాల్లో ఉచితంగా ఫోన్ చేసుకునే సదపాయం కూడా కల్పించాలి.
Also Read: Virat Kohli: విరాట్ కోహ్లి సలహాను పాటించని అశ్విన్.. చాలా తెలివిగా పాకిస్థాన్‌కు చెక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి