DELHI AIR QUALITY: గ్యాస్ ఛాంబర్ గా మారిన ఢిల్లీ.. దీపావళి వేడుకలతో నరకం

DELHI AIR QUALITY: మంగళవారం ఉదయం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 323గా నమోదైంది. నోయిడా, ఫరిదాబాద్, గురుగ్రామ్ లో గాలి నాణ్యత ప్రమాదకరస్థాయికి చేరుకుంది

Written by - Srisailam | Last Updated : Oct 25, 2022, 10:53 AM IST
  • ఢిల్లీలో భారీగా పెరిగిన వాయు కాలుష్యం
  • నిషేదం ఉన్నా క్రాకర్స్ కాల్చిన ఢిల్లీ వాసులు
  • ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 323గా నమోదు
DELHI AIR QUALITY: గ్యాస్ ఛాంబర్ గా మారిన ఢిల్లీ.. దీపావళి వేడుకలతో నరకం

DELHI AIR QUALITY:  దీపావళి వేడుకలు ఢిల్లీ నగర వాసుల కొంప ముంచాయి. బాణాసంచా పేలుళ్లలతో మరోసారి ఢిల్లీ గ్యాస్ చాంభర్ గా మారిపోయింది. ఢిల్లీలో వాయు కాలుష్యం భారీగా పెరిగింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో క్రాకర్స్ కాల్చడంపై నిషేదం ఉంది. అయినా అవేమి పట్టించుకోకుండా ఢిల్లీ వాసులు భారీగా పటాకులు కాల్చారు. వాయువ్య ఢిల్లీతో పాటు చాలచోట్ల ప్రజలు క్రాకర్స్ కాల్చి సంబరాలు చేసుకున్నారు. దీంతో  దేశ రాజధానిలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది.

మంగళవారం ఉదయం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 323గా నమోదైంది. నోయిడా, ఫరిదాబాద్, గురుగ్రామ్ లో గాలి నాణ్యత ప్రమాదకరస్థాయికి చేరుకుంది. అయితే దీపావళి తర్వాత నమోదైన రికార్డులు చూస్తే గత నాలుగేళ్లతో పోలిస్తే ఇదే తక్కువయ.  గత ఏడాది ఢిల్లీలో ఏక్యూఐ 382 గా ఉండగా.. 2020లో 414 పాయింట్లకు చేరింది. ఇక 2019లో 337గా రికార్డైంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ జీరో నుండి 50 పాయింట్ల మధ్య ఉంటే సేఫ్ జోన్. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరం.  101 నుంచి 200 వరకు ఉంటే కొంత ప్రమాదకరం.  300 దాటితే డేంజర్ లెవల్. 400 పాయింట్లు దాటితే అత్యంత ప్రమాదకరం. ప్రస్తుతానికి ఢిల్లీలో పొల్యూషన్ లెవల్ డేంజర్ స్థాయికి చేరింది. ఇది మరింత పెరిగితే మాత్రం ఢిల్లీ వాసులకు గండమే.

Also Read : Surya Grahan 2022 Timing: సూర్యహణాన్ని నేరుగా చూడాలనుకునేవారు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.. లేకపోతే అంతే సంగతి..

Also Read :  Diwali Celebrations: చీకట్లు నింపిన దీపావళి.. టపాసులు పేలి బాలుడు మృతి.. సరోజిని ఆస్పత్రికి క్యూ కట్టిన బాధితులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News