మహానాడు కాదు..అది మాయనాడు - బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ

                                 

Last Updated : May 29, 2018, 12:56 AM IST
మహానాడు కాదు..అది మాయనాడు - బీజేపీ చీఫ్ కన్నా  లక్ష్మీనారాయణ

ఏపీ సీఎం చంద్రబాబుపై ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఎన్నికల్లో చంద్రబాబు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని.. ఆయన మాయగాడనే విషయం ప్రజలకు తెలిసివచ్చిందన్నారు.  రాజధాని రైతులకు చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపించి  భూములను లాక్కకున్నారని విమర్శించారు. రైతుల భూములతో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. వాస్తవానికి చంద్రబాబు అసమర్థత వల్లే ఏపీకి అన్యాయం జరిగిందని అభిప్రాయపడ్డారు. టీడీపీ నిర్వహిస్తోంది మహానాడు కాదని...అది మాయనాడు అని కన్నా ఎద్దేవా చేశారు. 

ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ కాదు ఇది...
ఇప్పుడున్నది ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ కాదని కన్నా విమర్శించారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పై చెప్పులేయించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఎన్టీఆర్ మృతికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. కర్ణాటకలో బీజేపీకి ఓటువేయొద్దని చంద్రబాబు చెప్పినప్పటికీ.. అక్కడ తెలుగు వారి ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో 16 సీట్లు గెలిచామని అన్నారు. ప్రజలు చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు ఏజెంట్‌లా తయారయ్యారని మంత్రి కన్నా విమర్శించారు.

Trending News