Megastar Chiranjeevi Hot Comments on Garikipati Narasimharao issue: చాన్నాళ్ల క్రితం జరిగిన అలయ్ భలయ్ కార్యక్రమంలో ఏర్పడిన గరికపాటి- మెగాస్టార్ చిరంజీవి వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ విషయం గురించి వారిద్దరూ మర్చిపోయినా ఏదో ఒక విధంగా ఈ విషయం వార్తల్లోకి వస్తూనే ఉంది. తాజాగా మీడియాతో ముచ్చటించిన చిరంజీవి గరికపాటి వివాదం గురించి స్పందించారు. ఈ వివాదాన్ని గురించి ప్రస్తావించిన విలేకరులు మీరు తగ్గి ఉండటం అవసరమా అని ప్రశ్నించారు. దానికి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఏ విషయంలో అయినా సంయమనం పాటించడం ముఖ్యం అని అక్కడ అడుగు వెనక్కి తగ్గడం అనేది పాయింట్ కాదని చెప్పుకొచ్చారు.
సంయమనం పాటించినప్పుడే నిజా నిజాలు నిలకడ మీద బయటకు వస్తాయని పేర్కొన్న ఆయన తాను తప్పు చేయనని, ఒకవేళ తప్పు చేస్తే పొరపాటు అయిందని ఒప్పుకుంటానని పేర్కొన్నారు. ఒకవేళ నీ తప్పు లేకుండా ఆరోపణలు చేస్తే వెంటనే ఢీ కొట్టాల్సిన అవసరం లేదని నిజం నిలకడగా తెలుస్తుంది అనేది తాను పూర్తిగా నమ్ముతానని అన్నారు. అలా నమ్ముతాను కాబట్టే బ్లడ్ బ్యాంక్ విషయంలో నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు భూ కబ్జా చేశారంటూ ఆరోపణలు చేస్తే దానిమీద స్పందించలేదని అన్నారు. అసలు అక్కడ నా తప్పు లేనప్పుడు నేను ఎందుకు ఉలిక్కిపడాలి అని ప్రశ్నించిన చిరంజీవి తప్పు తెలుసుకొని మా మీద ఆరోపణలు చేసిన వారే నాకు సరెండర్ అయ్యారని పేర్కొన్నారు.
కోర్టు ద్వారానో అంతరాత్మ ద్వారానో నిజం తెలుసుకొని వారిలో వారే పశ్చాత్తాప పడ్డారని చెప్పుకొచ్చారు. ఫైనల్ గా నా బ్యాంకు బ్యాలెన్స్ ఎంత పెంచాను అన్నది ముఖ్యం కాదు నా హృదయానికి ఎంత మందిని దగ్గరగా తీసుకున్నాను అనేదే ముఖ్యమని చిరంజీవి పేర్కొన్నారు. నన్ను ఎద్దేవా చేసిన వారు దగ్గరకు వచ్చినా నేను ఆలింగం చేసుకున్నా ఇదే నాకు తెలిసిన ఫిలాసఫీ అంటూ చిరంజీవి వేదాంతం వల్లించారు. అలా ఉన్నాను కాబట్టి ఎక్కువ మంది మనస్సులను తెలుసుకున్నానని, నేను తప్పు చేయనని, నా గట్టి నమ్మకం అని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ పొరపాటున నేను తప్పు చేస్తే అందరికంటే ముందు నేనే బయటకు వస్తానని పేర్కొన్నారు.
నేను రాజకీయాల్లోకి వస్తానంటే విమర్శించిన వాళ్ళ కార్లపై రాళ్లు విసిరారని చెబుతూ అప్పట్లో రాజశేఖర్ దంపతుల కారు పై దాడి వ్యవహారాన్ని గుర్తు చేసిన చిరంజీవి ఈ విషయం తెలుసుకుని వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళానని నా తప్పులేదు కాబట్టే వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పుకొచ్చారు. ఆ ఫ్యాన్స్ తప్పు చేసిన వాళ్ళ ఇంటికి వెళ్లి నేను క్షమాపణలు కోరానని మెగాస్టార్ పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి గరికపాటి వివాదంలో ఇక చర్చలు అనవసరమని అక్కడితో వదిలేయాలని పేర్కొన్నారు. కానీ ఇందులో తప్పు ఎవరిది అనే విషయం గురించి మాత్రం స్పందించలేదు. నిజానికి ఈ విషయంలో గరికపాటిని టార్గెట్ చేస్తూ మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.
నాగబాబు కూడా ఈ విషయం మీద ట్వీట్ చేయడంతో మెగా అభిమానులందరూ తమదైన శైలిలో రెచ్చిపోయి కామెంట్లు చేశారు. ఇక్కడ వారిని చిరంజీవి వారించకపోవడంతో వారిని చిరంజీవి సమర్థిస్తున్నట్లుగా సంకేతాలు వెళ్లాయి. గతంలో తన తప్పు లేకపోతే వెళ్లి క్షమాపణలు కోరానని చెబుతున్న మెగాస్టార్ చిరంజీవి గరికపాటి విషయంలో తన అభిమానులు ఆయన టార్గెట్ చేసి కామెంట్స్ చేస్తున్నా ఆయన క్షమాపణలు కోరిన దాఖలాలు లేకపోవడంతో మెగా ఫాన్స్ కోపాన్ని చిరంజీవి అర్థం చేసుకున్నారా? అందుకే ఈ విషయంలో సైలెంట్ గా ఉన్నారా? అనే వాదన వినిపిస్తోంది. ఇక ఈ విషయం మీద ఇంకెంతకాలం చర్చ జరుగుతుందో చూడాలి మరి.
Also Read: Chandrababu Wife: చంద్రబాబు తన భార్యను ఏమని పిలుస్తారో తెలుసా? బయటపెట్టించిన బాలకృష్ణ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook