Karva Chauth 2022: కర్వా చౌత్‌లో భాగంగా భార్యాభర్తలు ఈ కీర్‌ను తీసుకుంటే.. జీవితంలో విడిపోవాలనే ఆలోచనలు రావు..

 Karva Chauth 2022 Recipe: కర్వా చౌత్  ఉపవాసాలు ప్రతి సంవత్సరం అత్తగారు ఇచ్చే సర్గితో తయారు అవుతాయి. అయితే పూర్వీకులు ఈ పండగకు చాలా ప్రధానత్యను ఇచ్చారు. అయితే ఉపవాసాలు పాటించే క్రమంలో తప్పకుండా కీర్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.    

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 14, 2022, 05:52 PM IST
  • కర్వా చౌత్‌లో భాగంగా భార్యాభర్తలు
  • ఈ కీర్‌ను తీసుకుంటే..
  • జీవితంలో విడిపోవాలనే ఆలోచనలు రావు.
Karva Chauth 2022: కర్వా చౌత్‌లో భాగంగా భార్యాభర్తలు ఈ కీర్‌ను తీసుకుంటే.. జీవితంలో విడిపోవాలనే ఆలోచనలు రావు..

Karva Chauth 2022 Recipe: వివాహిత స్త్రీలకు కర్వా చౌత్ పండుగ చాలా ప్రముఖ్యమైనది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని కృష్ణ పక్ష చతుర్థి తిథి నాడు ఈ పండగను జరుపుకుంటారు. మహిళలంతా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల భర్త దీర్ఘాయువు, ఆరోగ్యవంతమైన ఉంటారని హిందువులు నమ్ముతారు. ఈ వ్రతాన్ని ప్రతి సంవత్సరం మహిళలు చేయడం వల్ల భార్యాభర్తల మధ్య బంధాన్ని విడదీయరాని సంబంధాలు ఏర్పడతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా కర్వా చౌత్ ఉపవాసాలు పాటిస్తున్నారు. అయితే హిందూ సాంప్రదాయాల ప్రకారం ఉపవాసాలు ప్రతి సంవత్సరం సర్గితో మొదలవుతాయి. సర్గి సమయంలో హల్వా,  ఖీర్‌ను కూడా వినియోగిస్తారు. స్త్రీలు ఖీర్ తీసుకోవడం వల్ల శక్తి వంతంగా తయారవుతారని శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా ఇలా స్వీట్స్‌ తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.

ఖీర్ తయారీకి కావలసిన పదార్థాలు:
>>తమలపాకులు
>>పెనీలు 100 గ్రాములు
>>1 లీటరు పాలు
>>నెయ్యి
>>డ్రై ఫ్రూట్స్
>>75 గ్రాములు చక్కెర
>>1 tsp యాలకుల పొడి
>>10 తరిగిన బాదం
>>12 పిస్తాపప్పులు
>>10 ఎండుద్రాక్ష
>>కుంకుమపువ్వు

తయారీ విధానం:
>>ముందుగా గోరువెచ్చని పాలలో కుంకుమపువ్వు కలిపి కాసేపు అలాగే ఉంచాలి.
>>ఇప్పుడు పాన్‌లో ఫెనీని వేయించాలి. వేయించేటప్పుడు మంటను తక్కువగా పెట్టుకోండి.
>>ఇప్పుడు బాణలిలో పాలు మరిగించి అందులో కుంకుమపువ్వు, యాలకుల పొడి, పంచదార వేయాలి. ఆ తర్వాత ఆపై పెనీలను వేసి 3 నుంచి 4 నిమిషాలు ఉడికించాలి.
>>తేలికపాటి చేతులతో పెనీలను కలపండి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి.. ఎండుద్రాక్ష, పిస్తా, బాదంపప్పు వేయాలి. చివరగా సర్వ్ చేయండి.
>>పెనీల ఖీర్‌ను 2 నుండి 3 రోజులు నిల్వ చేసుకోవచ్చు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)

Also Read: టీ20 ప్రపంచకప్‌లో భువనేశ్వర్‌ రాణించలేడు.. టీమిండియాకు కష్టాలు తప్పవు: వసీం అక్రమ్‌

Also Read: ప్రేమను నిరాకరించిందని.. ట్రైన్ కింద తోసేసి యువతిని హత్య చేసిన ప్రేమోన్మాది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News