Surya Gochar 2022: సూర్యుని రాశిచక్రంలోని మార్పుల కారణంగా భవిష్యత్‌లో పలువురి రాశి చక్రల్లో మారులు వచ్చే అవకాశాలున్నాయని శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. ఈ మార్పుల కారణంగా 12 రాశులపై విభిన్న ప్రభావాలు పడబోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. సూర్యుడు ప్రతి నెల రాశులు మారతాడని ఈ నెల అక్టోబర్ 17న మారబోతున్నాడని సమాచారం. అయితే ఈ సూర్యుని సంచారం కారణంగా పలువురి జీవితాల్లో భారీ మార్పులు రాబోతున్నాయి. దీపావళికి వారం రోజుల ముందు అక్టోబర్ 17న సూర్యభగవానుడు తులారాశిలోకి ప్రవేశించనున్నారు. అయితే ఈ సంచారం వల్ల వృషభ రాశి వారిపై ఎలాంటి ప్రభావం చూపబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి వారు వ్యాపారాల్లో అవసరాన్ని బట్టి వస్తువులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీరు రుణాలు కూడా ఇవ్వకూడదని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరు ఈ సంచారం వల్ల డబ్బులను నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆర్థిక పరంగా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. వీరు ప్రభుత్వం నుంచి రుణం తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లయితే..తప్పకుండా రుణాలు పొందుతారని నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో అస్సలు నిబంధనలు ఉల్లంఘించవద్దని శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో మీరు జరిమానాలు కూడా కట్టాల్సి వస్తుంది. కాబట్టి చేసే పనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
ఈ పనులను పెండింగ్‌లో ఉంచవద్దు:
వీరు ఎంత కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే అంతమంచిదని శాస్త్రం తెలుపుతోంది. లేదంటే తీవ్ర సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ రాశివారు తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా వృషభ రాశి వారు ఆఫీసుల్లో పలు రకాల సమస్యలు కూడా ఎదుర్కొంటారు. అయితే వీటి నుంచి తట్టుకుని స్ట్రాంగ్‌గా నిలబడాల్సి ఉంటుంది. అయితే ఆఫీసులో వాగ్వాదానికి దిగకుండా అన్నింటిపై ప్రశాంతంగా ఉండడం మేలని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగడం వల్ల ఫీచర్‌లో కష్టాలు వస్తాయి. కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండడం చాలా మేలని నిపుణులు చెబుతున్నారు.
ఎక్కువసేపు టీవీ చూడవద్దు:
సూర్య సంచారం వల్ల మార్పులతో వృషభ రాశి వారు తీవ్ర వ్యాధులకు గురయ్యే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వీరు కుటుంబంలో తల్లి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీరు వైరల్, జలుబు లేదా జ్వరం వంటి వ్యాధుల బారిన పడతారు. దీని కోసం మీరు ఇంటి కషాయాలను తీసుకోవచ్చు. ముఖ్యంగా వీరు ఎక్కువ సేపు టీవీ చూడవద్దని అంతేకాకుండా యాప్‌టాప్‌లో ఎక్కువసేపు పని చేయవద్దని శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. దీని వల్ల తలనొప్పిలు ఇతర వ్యధులు వచ్చే అవకాశాలున్నాయి.
Also Read : Galata Geetu : భయంకరమైన అతి.. గీతూ ఓవర్ యాక్షన
Also Read : Adipurush case : ఆదిపురుష్‌కు దెబ్బ మీద దెబ్బ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook