What Should Eat in Karva Chauth Sargi: హిందూ సాంప్రదాయం ప్రకారం కర్వా చౌత్ గొప్ప ప్రాముఖ్యత కలిగి ఉంది. వారం రోజుల పాటు ఉపవాసాలు పాటించి భక్తి శ్రద్ధలతో దేవులన్ను పూజిస్తారు. అయితే ఈ సంవత్సరం అక్టోబర్ 13న కర్వా చౌత్ ఉపవాసం పాటించడం వల్ల అన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఉదయాన్నే నిద్రలేచి స్నానం వంటి కార్యక్రమాలు చేసి సూర్యోదయానికి ముందే సర్గిని తీసుకోవడం ఒక ఆనవాయితిగా వస్తోంది. అయితే ఈ సర్గి సాంప్రదాయాల ప్రకారం అత్త కోడలికి ఇస్తారని శాస్త్రంలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో స్వీట్లు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, పాలు, పెరుగు వంటి అనేక ఆహార పదార్థాలను అందులో ఉంచుతారు. వీటితోనే కర్వా చౌత్ ఉపవాసం ప్రారంభమవుతుందని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
సర్గిలో ఈ పండ్లను కూడా కలుపుకోండి:
అత్త తన కోడలికి ఇచ్చే సర్గి పళ్ళెంలో అంజీర్ పండ్లను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో శరీరానికి కావాల్సిన కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు లభిస్తాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల ఉపవాసాల్లో భాగంగా వీటిని తీసుకుంటే మంచి ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా శరీరం యాక్టివ్‌గా కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా అంజీర పండ్లను తీసుకోవాలని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఉపవాసంలో అంజీర్ ఎందుకు ప్రయోజనకరంగా ఉంటుంది?:
ఉపవాస సమయంలో కడుపు చాలా కాలం పాటు ఖాళీగా ఉంటుంది. ఈ సమయంలో రక్తంలో చక్కెర స్థాయిలలో చాలా హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి. కాబట్టి దీని కారణంగా రక్త పోటు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ఇలాంటి సమస్యలు తలెత్తకుండా అంజీర్ పండ్లు ప్రభావవంతంగా కృషి చేస్తాయి.
ప్రేగు ఆరోగ్యానికి మంచిది:
అత్తి పండ్లలో ప్రీబయోటిక్స్ వంటి మూలకాలు ఎక్కువగా ఉంటాయి. ఇది జీర్ణక్రియకు, పేగు ఆరోగ్యానికి చాలు రకాలుగా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అత్తి పండ్లను రాత్రిపూట పాలతో నానబెట్టి ఉదయం అదే పాలతో ఆహారంలో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read : RC 15 : దిల్ రాజు టీం అశ్రద్ద.. రామ్ చరణ్ అంజలి పిక్స్ లీక్
Also Read : Bollywood Affairs: ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి కాకముందే బ్రేకప్ చెప్పుకున్న జంటలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook