BRS IN AP: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా రోజున కొత్త జాతీయ పార్టీ ప్రకటించారు. దేశ వ్యాప్తంగా 100 లోక్ సభ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ని పోటీకి దింపేలా కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. పొరుగు రాష్ట్రాలతో పాటు యూపీ, పంజాబ్, గుజరాత్, ఢిల్లీలో కేసీఆర్ పార్టీ పోటీ చేయనుంది తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీపై దేశ వ్యాప్తంగా రకరకాల వాదనలు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఏపీకి చెందిన చాలా మంది నేతలతో కేసీఆర్ టీమ్ చర్చలు జరిపిందనే వార్తలు వస్తున్నాయి. ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమలో బీఆర్ఎస్ పోటీ చేయనుందని చెబుతున్నారు. బీఆర్ఎస్ విషయంలో ఏపీలోని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతలు స్పందిస్తున్నారు. వైసీపీ నేతలు కొంత సీరియస్ కామెంట్లు చేశారు.
ఏపీలో ఎవరూ పోటీ చేసినా తమకు నష్టం లేదంటూనే కేసీఆర్ ను టార్గెట్ చేసేలా వైసీపీ నేతలు మాట్లాడారు. ఉద్యమ సమయంలో ఏపీ ప్రజలను దూషించిన కేసీఆర్ పార్టీని ఏపీలో ఎవరూ పట్టించుకోరని కామెంట్ చేశారు. ఏపీలో మరో 25 ఏళ్లు జగనే సీఎంగా ఉంటారని చెప్పారు. . బీఆర్ఎస్ పార్టీతో తమకొచ్చే నష్టం కష్టం ఏమీ లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎవరికైనా పార్టీ పెట్టుకునే హక్కు స్వేచ్ఛ ఉందని.. తాము ఎవరి కూటమిలో కలవబోమని తేల్చిచెప్పారు. అటు టీడీపీ నేతలు కూడా బీఆర్ఎస్ ను లైట్ తీసుకుంటున్నట్లుగా మాట్లాడారు. అయితే కేసీఆర్ టీమ్ మాత్రం ఏపీలో సీరియస్ వర్క్ చేస్తుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పలు వార్తలు వస్తున్నాయి. ఏపీకి చెందిన వందలాది మంది నేతలకు హైదరాబాద్ లో భారీగా ఆస్తులున్నాయి. దీంతో కొందరు నేతలపై సామదాన దండోపాయాలు ప్రయోగించి ఏపీలో పోటీ చేయడం ఖాయమని అంటున్నారు.
తెలంగాణ సరిహద్దు జిల్లాలైన కృష్ణా, గుంటూరుతో పాటు రాయలసీమ జిల్లాల్లో బీఆర్ఎస్ తరఫున అభ్యర్థులను పెట్టవచ్చని తెలుస్తోంది.ఏపీలో కనీసం 4 5 సీట్లను సాధించాలని కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెబుతున్నారు.ఇక్కడే వైసీపీ, టీఆర్ఎస్ మధ్య అవగాహన ఉందని తెలుస్తోంది. ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకు కలిసివస్తుందనే అంచనాలో వైసీపీ నేతలు ఉన్నారంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ కలిసి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొత్తుల విషయంలో చంద్రబాబు కూడా సిగ్నల్ ఇచ్చేశారు. 2014 తరహాలో కూటమి ఏర్పడవచ్చనే ప్రచారం సాగుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని ప్రకటించిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. ఆ దిశగా ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా బరిలో ఉంటే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదు. అది జరిగితే తమకు నష్టం. అందుకే వైసీపీ కొత్త ప్లాన్ చేసిందని.. అందులో భాగంగానే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు.
ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేస్తే కొంత ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందనే అంచనాలో వైసీపీ నేతలు ఉన్నారంటున్నారు. అదే జరిగితే తమకు లాభిస్తుందని చెబుతున్నారట. అందుకే కేసీఆర్ తో తమకు మంచి సంబంధాలు ఉన్నా ఏపీ రాజకీయ ప్రయోజనాల కోసమే దూరంగా ఉండాలని నిర్ణయించారని తెలుస్తోంది. బీఆర్ఎస్ ను విమర్శిస్తూ రెచ్చగొట్టడం వల్లే ఖచ్చితంగా ఏపీలో కేసీఆర్ పార్టీ అభ్యర్థులు బరిలో ఉండేలా స్కెచ్ వేస్తున్నారని అంటున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీపై సలహదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సహా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఘాటు వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్, సీఎం జగన్ మధ్య అవగాహన ఉందనే చర్చ కూడా పొలిటికల్ సర్కిళ్లలో సాగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook