Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ఆవర్తనం ప్రభావం అధికంగా ఉంది. నిన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం..ఇవాళ తెలంగాణ పరిసరాల్లోని విదర్భ వరకు కొనసాగుతోంది. సగటు సముద్ర మట్టానికి 1.5 నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
రాగల మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని పలుచోట్ల నేడు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారిణి డాక్టర్ నాగరత్నం తెలిపారు. మరికొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయని పేర్కొంది. వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..అవసరమైతేనే బయటకు రావాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇటు ఏపీలోనూ ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోంది. నిన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం..నేడు తెలంగాణకు మీదుగా విస్తరించింది. సగటు సముద్ర మట్టానికి 1.5 నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో ఏపీవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి.
కోస్తాంధ్రలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి, విశాఖ వాతావరణ శాఖ తెలిపాయి. మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ఇటు తీరం వెంట పెనుగాలులు వీచే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో గంటకు 35 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.ఇటు రాయలసీమలోనూ ఇదే పరిస్థితి ఉంది.
తెలంగాణ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతం కావడంతో కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాయలసీమవ్యాప్తంగా ముసురు పట్టుకుంది. పగలు, రాత్రి వేళల్లో చిరుజల్లులు పడనున్నాయి. చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Also read:Viral Video: వామ్మో ఇదేమి రా సామీ..చెట్టును ఇలా ఎక్కేసింది..కొండ చిలువ వీడియో వైరల్..!
Also read:Extramarital Affairs: సీరియల్ నటితో భర్త రాసలీలలు..రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు మరోమారు భారీ వర్ష సూచన..ఆయా జిల్లాలకు వాతావరణ హెచ్చరికలు..!
తెలుగు రాష్ట్రాల్లో చిరు జల్లులు
ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్
లెటెస్ట్ వెదర్ రిపోర్ట్