Rashmika- Vijay to Maldives: మాల్దీవులకు రష్మిక, విజయ్.. సంధింగ్ సంధింగ్ అంటూ మళ్లీ రచ్చ!

Rashmika Mandanna, Vijay Deverakonda Went to Maldives: రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ముంబై ఎయిర్ పోర్టులో కెమరా కంటికి చిక్కడంతో వారిద్దరూ మాల్దీవులకు వెళుతూన్నట్టు ప్రచారం మొదలైంది. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 7, 2022, 12:49 PM IST
Rashmika- Vijay to Maldives: మాల్దీవులకు రష్మిక, విజయ్.. సంధింగ్ సంధింగ్ అంటూ మళ్లీ రచ్చ!

Rashmika Mandanna, Vijay Deverakonda Went to Maldives: సినీ పరిశ్రమలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ పుట్టడం చాలా సర్వసాధారణమైన విషయమే. తెలుగులో అలా హీరో హీరోయిన్లుగా నటించి ప్రేమించి తర్వాత వివాహం కూడా చేసుకున్న జంటలు చాలా ఉన్నాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కూడా ప్రేమలో ఉన్నారని అనేక కథనాలు తెర మీదకు వస్తూ ఉంటాయి. వీరిద్దరూ వాటిని పలుసార్లు ఖండిస్తూనే ఉంటారు అయినా సరే మళ్లీ మళ్లీ ప్రచారం జరుగుతూనే ఉంటుంది.

తాజా విషయం ఏమిటంటే వీరిద్దరూ కలిసి ఇప్పుడు మాల్దీవులకు వెళ్ళినట్లుగా ప్రచారం జరుగుతోంది. అసలు విషయం ఏమిటంటే రష్మిక హీరోయిన్గా నటించిన గుడ్ బై అనే సినిమా అక్టోబర్ ఏడో తేదీ విడుదలైంది. అమితాబచ్చన్ కీలకపాత్రలలో నటించిన ఈ సినిమాలో ఆమె అమితాబచ్చన్ కుమార్తె పాత్రలో కనిపించింది. అయితే ఈ రోజు అంటే అక్టోబర్ 7వ తేదీన ఆమె ముంబై ఎయిర్ పోర్ట్ లో ఫోటోగ్రాఫర్ల కెమెరాకు చిక్కింది. ఆమె వెళ్లిన కాసేపటికి విజయ్ దేవరకొండ కూడా అదే ఫోటోగ్రాఫర్ల కెమెరాలకు చిక్కడంతో వీరిద్దరూ కలిసి మాల్దీవులకు వెళుతున్నారు అనే ప్రచారం మొదలైంది.

గతంలో వీరిద్దరూ తాము మంచి స్నేహితులమని పలు సందర్భాల్లో వెల్లడించారు కానీ ఇద్దరు కలిసి మాల్దీవులకు వెళ్తున్నారనే ప్రచారం నేపథ్యంలో వీరిద్దరి మధ్య స్నేహానికి మించి ఇంకేదో ఉందని, అది ప్రేమే అయి ఉంటుందని మళ్లీ ప్రచారం మొదలైంది. నిజానికి విజయ్ దేవరకొండ, రష్మిక మందన కలిసి రెండు సినిమాల్లో హీరో హీరోయిన్లుగా నటించారు. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాల్లో వీరిద్దరికి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి.

అయితే ఆ మధ్య ఒక పండుగ సందర్భంగా ఆ పండుగను విజయ్ దేవరకొండ ఇంట్లోనే రష్మిక మందన జరుపుకున్నట్లు టాక్ వినిపించింది. దీంతో వీరిద్దరి రిలేషన్ గురించి కూడా అనేక ప్రచారాలు జరిగాయి. అయితే ఇప్పుడు వీరిద్దరూ కలిసి మాల్దీవులకు వెళ్తున్నారనే వార్త అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ క్రమంలో వీరి డేటింగ్ గురించి మరోసారి చర్చ మొదలైంది.

Also Read: Good Bye Movie Review: రష్మిక -అమితాబ్ బచ్చన్ 'గుడ్ బై' సినిమా ఎలా ఉందంటే?

Also Read: Gargeyi-Hello Meera : ఒకే పాత్రతో 'హలో మీరా'.. ఇంత ఆలస్యమా?.. హీరోయిన్ గార్గేయి పోస్ట్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News