Rain Alert: తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ఆవర్తన ఎఫెక్ట్..మరికొన్ని రోజులు వానలే వానలు..!

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోంది. ఇప్పటికే పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. లెటెస్ట్ వెదర్ రిపోర్ట్..

Written by - Alla Swamy | Last Updated : Oct 2, 2022, 04:28 PM IST
  • తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ సూచనలు
  • ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్
  • తాజాగా వాతావరణ శాఖ హెచ్చరికలు
Rain Alert: తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ఆవర్తన ఎఫెక్ట్..మరికొన్ని రోజులు వానలే వానలు..!

Rain Alert: ఏపీ, తెలంగాణలో జోరు వర్షాలు కురుస్తున్నాయి. రాగల మూడురోజులపాటు వానలు ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. నైరుతి దిశగా వంపు తిరిగి ఉంది. దీనికి అనుబంధంగా మరో ఆవర్తనం కేంద్రీకృతమైంది.

ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసరాల్లో ఇది కొనసాగుతోంది. సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంది. వీటి ప్రభావంతో రాగల మూడురోజులపాటు వర్షాలు పడనున్నాయి. రాగల రెండురోజులపాటు తెలంగాణలో అక్కడక్కడ వానలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మూడో రోజు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ, రేపు కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం కనిపించనుంది.

ఎల్లుండి మాత్రం రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇప్పటికే పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అవి అలాగే కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఏపీలోనూ వాతావరణ శాఖ హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ తీరంలోనే ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమవడంతో..రాష్ట్రంపై అధిక ప్రభావాన్ని చూపుతోంది.

ఆంధ్రప్రదేశ్‌ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమైంది. సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాగలమూడురోజులపాటు ఇలాంటి వాతావరణమే ఉండనుంది. ఈమేరకు వెదర్ బులిటెన్‌ను అమరావతి, విశాఖ వాతావరణ శాఖలు వెల్లడించాయి. తీరం వెంట పెనుగాలులు వీచే అవకాశం ఉంది.

తీర ప్రాంతాల్లో గంటకు 35 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. దీంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని తెలిపారు. ఇటు రాయలసీమలోనూ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు అయ్యింది. కర్నూలు జిల్లాలో జోరుగా వానలు పడుతున్నాయి.

Also read:ICC T20 WC 2022: అతడు లేకపోతే టీమిండియాకు కష్టమే..ఆసీస్ మాజీ ఆల్ రౌండర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Also read:Rangareddy: రంగారెడ్డి జిల్లాలో విషాదం..ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News