Russia vs Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక ఆపరేషన్ ఆగడం లేదు. తాజాగా జపోరిజియాలో ఓ వాహనంపై దాడి జరిగింది. ఇందులో 23 మంది స్థానికులు దుర్మరణం చెందారు. మరో 28 మంది గాయపడ్డారు. ఈవిషయాన్ని స్థానిక అధికారులు తెలిపారు. రష్యా ఆక్రమిత భూభాగానికి వెళ్తున్న కాన్వాయ్‌ను రష్యా సైనికులు టార్గెట్ చేశారు. దీంతో క్రెమ్లిన్ దాడులు చేశారు. ఈఘటనలో వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
మృతదేహాలను చల్లాచెదురుగా పడిపోయాయి. రష్యా ఆక్రమిత భూభాగం నుంచి తమ బంధువులను తీసుకువచ్చేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను రష్యాలో విలీనం చేస్తున్న సమయంలో క్రెమ్లిన్ దాడి జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఉక్రెయిన్‌లోని ప్రాంతాలను రష్యాలో కలుపుతున్నట్లు ఇటీవల ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఈనేపథ్యంలో దాడి జరిగినట్లు తెలుస్తోంది.
ఉక్రెయిన్‌లోని జపోరియా, ఖేర్సన్, లుహాన్స్క్, దొనెట్స్క్ ప్రాంతాలను రష్యా సైనికులు ఆక్రమించుకున్నారు. ఆ ప్రాంతాలను విలీనానికి అంగీకారం తెలిపాయని పుతిన్ స్పష్టం చేశారు. ఈక్రమంలోనే ఆయన ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో మాస్కోకు అనుకూలంగా సంతకాలు చేశారని తెలిపారు. ఫిబ్రవరి నెల నుంచి ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు వేల మంది మరణించినా యుద్ధం ఆగడం లేదు.
దీని వల్ల అంతర్జాతీయంగా చాలా సమస్యలు తలెత్తాయి. అగ్ర దేశాలు హెచ్చరించినా..రష్యా తీరు మారడం లేదు. ఐక్యరాజ్య సమితి సైతం ఎన్నో సార్లు జోక్యం చేసుకుందని..ఐనా పరిస్థితి సాధారణ స్థితికి రావడం లేదు. ఉక్రెయిన్‌ను ఆక్రమించేందుకు రష్యా కుట్ర చేస్తోందని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. ఇందులోభాగంగానే యుద్ధం చేస్తోందని ఆరోపిస్తున్నారు. తమకు ఎవరిపైనా కక్ష లేదని..అక్కడున్న వ్యతిరేక శక్తులను అణిచి వేస్తున్నామని రష్యా అంటోంది.
Also read:Nagarjuna: సినీ నటుడు నాగార్జున రాజకీయాల్లో వస్తున్నారా..? ఆయన ఏమన్నారంటే..!
Also read:IND vs SA: కెప్టెన్‌గా ధోనీ రికార్డును బ్రేక్ చేసిన రోహిత్ శర్మ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.