/telugu/photo-gallery/puri-jagannadh-explains-about-emotional-blockmail-in-puri-musings-pa-180794 Puri Jagannadh: వాళ్లు అమాయకులుగా కన్పించే క్రిమినల్స్..  షాకింగ్ కామెంట్స్ చేసిన పూరీ జగన్నాథ్.. స్టోరీ ఏంటంటే..? Puri Jagannadh: వాళ్లు అమాయకులుగా కన్పించే క్రిమినల్స్.. షాకింగ్ కామెంట్స్ చేసిన పూరీ జగన్నాథ్.. స్టోరీ ఏంటంటే..? 180794

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ముసురు పట్టుకుంది. రాగల మూడురోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. ఇటు తూర్పు పడమర ద్రోణి ఆంధ్రప్రదేశ్‌ తీరాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం, రాయలసీమ, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా కోస్తా, కర్ణాటక తీరం వరకు కొనసాగుతోంది.

సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దీంతో రాగల మూడురోజులపాటు వర్షాలు కురవనున్నాయి. ఇవాళ తెలంగాణలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. రేపు అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. తెలంగాణలో పలుచోట్ల ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వానలు పడనున్నాయి. 

మరోవైపు తెలంగాణలో జిల్లాల్లో వాతావరణ శాఖ హెచ్చరికలు కొనసాగుతున్నాయి. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ చేశారు. ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, భూపాలపల్లి, పెద్దపల్లి, కొత్తగూడెం, ములుగు, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, సిద్దిపేట, జనగామ, రంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయి.

హైదరాబాద్, కామారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూలు, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉండనుంది. ఇవాళ, రేపు, ఎల్లుండి ఇదే పరిస్థితి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇటు ఏపీవ్యాప్తంగా గత రెండురోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఉపరితల ఆవర్తనం ఏపీ తీరంలో ఉండటంతో ఆ ప్రభావం అధికంగా ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

రాగల మూడురోజులపాటు భారీ వర్షాలు పడతాయని అమరావతి, విశాఖ వాతావరణ శాఖ తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ తీరం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇటు తూర్పు పడమర ద్రోణి సైతం ఉపరితల ఆవర్తనం వెంటే కేంద్రీకృతమైంది. రాగల మూడురోజులపాటు ఇదే వాతావరణం ఉంటుందని తెలుస్తోంది. మరి ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు అలర్ట్‌గా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Also read:Mohammed Siraj: అంతలోనే ఎంతపనాయె.. మహ్మద్ సిరాజ్‌ ఆశలు గల్లంతు!

Also read:AP Govt: నిరుద్యోగులకు శుభవార్త..కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ ప్రభుత్వం..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Section: 
English Title: 
rain alert: surface periodicity effect on telugu states next three days heavy rains
News Source: 
Home Title: 

Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్..!

Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్..!
Caption: 
rain alert: surface periodicity effect on telugu states next three days heavy rains(file)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్

లెటెస్ట్ వెదర్ రిపోర్ట్

Mobile Title: 
Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్
Alla Swamy
Publish Later: 
No
Publish At: 
Friday, September 30, 2022 - 14:28
Request Count: 
92
Is Breaking News: 
No