Mercedes Benz: మెర్సిడెస్ బెంజ్ కారును ఢీకొని రెండు ముక్కలైన ట్రాక్టర్, వీడియో చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

Mercedes Benz: మెర్సిడెస్ బెంజ్ కారు..అత్యంత ఖరీదైన లగ్జరీ కారు. కేవలం లగ్జరీనే కాదు..బాడీ కూడా స్ట్రాంగ్ అని రుజువు చేసింది ఈ ఘటన. తిరుపతి సమీపంలో జరిగిన ఈ ప్రమాదం..మెర్సిడెస్ బెంజ్ కంపెనీ ప్రచారానికి పనిచేస్తుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 28, 2022, 05:41 PM IST
Mercedes Benz: మెర్సిడెస్ బెంజ్ కారును ఢీకొని రెండు ముక్కలైన ట్రాక్టర్, వీడియో చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

Mercedes Benz: మెర్సిడెస్ బెంజ్ కారు..అత్యంత ఖరీదైన లగ్జరీ కారు. కేవలం లగ్జరీనే కాదు..బాడీ కూడా స్ట్రాంగ్ అని రుజువు చేసింది ఈ ఘటన. తిరుపతి సమీపంలో జరిగిన ఈ ప్రమాదం..మెర్సిడెస్ బెంజ్ కంపెనీ ప్రచారానికి పనిచేస్తుంది. 

కారు ప్రేమికులు ఎక్కువగా ఇష్టపడేది మెర్సిడెస్ బెంజ్ కారు. అత్యంత ఖరీదైన లగ్జరీ కారు. ఇప్పటి వరకూ ఈ కారు లగ్జరీకే అని భావించినవారికి ఇప్పుడు మరో విషయం స్పష్టమైంది. మెర్సిడెస్ బెంజ్ కారు కేవలం లగ్జరీపరంగానే కాకుండా బాడీ కూడా స్ట్రాంగ్ అని ఫుల్ సేఫ్టీ అని తెలిసింది. 

ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మెర్సిడెస్ బెంజ్ పవర్ ఏంటనేది స్పష్టమైంది. మెర్సిడెస్ బెంజ్ కారు తిరుపతి సమీపంలోని చంద్రగిరి బైపాస్‌లో..వెళ్తుండగా రాంగ్ రూట్‌లో వస్తున్న ట్రాక్టర్ ఢీ కొట్టింది. మెర్సిడెస్ బెంజ్ కారును ఢీ కొట్టిన ట్రాక్టర్ రెండు ముక్కలైంది. ట్రాక్టర్ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడగా..అటు బెంజ్ కారులో ఉన్న ప్రయాణీకులకు కూడా ఏం కాలేదు. బెంజ్ కారు ముందు భాగం ఎడమవైపు మాత్రం డ్యామేజ్ అయింది. కారును ఢీ కొట్టిన ట్రాక్టర్ రెండుగా విరిగిపోవడం ఇదే తొలిసారి.

ఈ రోడ్డు ప్రమాదం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. కారు దెబ్బకు ట్రాక్టర్ రెండుగా విరిగిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మెర్సిడెస్ బెంజ్ స్ట్రాంగ్‌నెస్‌కు ఇది ఉదాహరణ అని కొందరంటున్నారు. మెర్సిడెస్ బెంజ్ కారు ప్రచారానికి ఈ రోడ్డు ప్రమాదం పనిచేస్తుందని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. మెర్సిడెస్ కారు దెబ్బకు రెండు ముక్కలవడమే కాకుండా..ట్రాక్టర్ పల్టీ కొట్టింది. కారు మాత్రం అలాగే నిలబడి ఉంది. 

Also read: Snake and Nagamani: పాము తలను కట్ చేసి 2 నాగమణుల్ని తీయడం చూశారా, షాకింగ్ వైరల్ వీడియో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News