Rain Alert: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రాగల మూడురోజులపాటు వర్షాలు కురవనున్నాయి. నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఇవాళ వాయవ్య, దాని పరిసర పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది. సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించింది. అక్టోబర్ 1న ఈశాన్యం దాని ఆనుకుని ఉన్న తూర్పు-మధ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ, రేపు, ఎల్లుండి తెలంగాణవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవనుంది. పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ ఇవాళ, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడనున్నాయి. మొన్నటి వరకు రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం కనిపించింది.
ఐతే నిన్న ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు పలు చోట్లు భారీ వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల పంటలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని చోట్ల రైతులు దుక్కి దున్నె పనిలో పడ్డారు. హైదరాబాద్‌లో నిన్న ఏకధాటిగా భారీ వర్షం కురిసింది. సాయంత్రం 5 గంటల నుంచి 11 గంటల వరకు ఏకధాటిగా వర్షం పడింది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం పడటంతో వాహనదారులు ఇక్కట్లు పడ్డారు.
ప్రధాన రోడ్లన్నీ చెరువులను తలపించాయి. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఒక కిలోమీటర్ దాటేందుకు గంటకు పైగా సమయం పట్టింది. మెహదీపట్నం, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఎల్బీనగర్, కూకట్‌పల్లి వంటి ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రోడ్లపైనే మోకాల వరకు నీరు నిలిచిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది..పరిస్థితిని చక్కదిద్దారు. డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించారు.
మరోవైపు ఏపీలోనూ చిరుజల్లులు పడుతున్నాయి. ఇవాళ వాయవ్య, దాని పరిసర పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో వర్షాలు పడుతున్నాయి. తీరం వెంట పెను గాలులు వీస్తున్నాయి. గంటకు 35 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఉండనున్నాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాయల సీమ జిల్లాల్లోనూ వర్షాలు పడుతున్నాయి. రాగల మూడురోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని అమరావతి, విశాఖ వాతావరణ శాఖలు తెలిపాయి.
Also read:Tragedy at Anirudh's Home: అనిరుధ్ ఇంట తీవ్ర విషాదం.. ఏమైందంటే?
Also read:America Accident: అమెరికాలో రోడ్ టెర్రర్..ముగ్గురు ఎన్నారైల దుర్మరణం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..!
తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన
కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
లెటెస్ట్ వెదర్ రిపోర్ట్