Remedies for Rahu Dosh: ఆస్ట్రాలజీ ప్రకారం, జాతకంలో గ్రహాలు అననుకూల స్థానంలో ఉంటే గ్రహ దోషాలు తలెత్తుతాయి. ముఖ్యంగా మీ జాతకంలో రాహు దోషం ఉన్నట్లయితే ఆ వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కొంటాడు. ఆర్థిక కష్టాలు చుట్టిముడతాయి. పనులు నిలిచిపోతాయి. ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే రాహు దోష (Rahu Dosh Remedies) నివారణకు చర్యలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకుందాం.
రాహు దోష పరిహారాలు..
>> మీ జాతకంలోని రాహు దోషాన్ని తొలగించడానికి విష్ణువు మరియు శివుడిని పూజించండి. ఇందుకోసం ప్రతి సోమ, శనివారాల్లో నల్ల నువ్వులను నీటిలో వేసి, ఆపై శివలింగానికి అభిషేకం చేయండి. దీనితో పాటు మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో కుశ గడ్డి వేసుకోండి. ఈ రెండు చర్యల వల్ల రాహు, కేతు గ్రహాలు ప్రశాంతంగా ఉంటాయని నమ్ముతారు. అలాగే కుండలిలోని రాహుదోషం తొలగిపోతుంది.
>> రాహు మంత్రం జపించడం వల్ల రాహు దోషం తొలగిపోతుంది. ఇందుకోసం మీరు ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి ఆలయానికి వెళ్లండి. అక్కడ 'ఓం రాహ్వే నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా చేయడం వల్ల రాహుదోషం నుండి బయటపడతారు.
>> గోమేధిక రత్నాన్ని ధరించడం వల్ల కూడా రాహుదోషాన్ని తొలగించవచ్చు. అలాగే శనివారం నాడు ఉదయం రావిచెట్టుకు నీరు పోసి.. సాయంత్రం దాని కింద దీపం వెలిగించి పూజించాలి. రాహు దోషాన్ని తొలగించడానికి ఇది కూడా ప్రధాన పరిహారం. అలాగే, బుధవారం నాడు నల్ల కుక్కకు తీపి రొట్టెలు తినిపించడం కూడా రాహు దోషాన్ని తొలగిస్తుంది.
Also Read: Mars Transit 2022: వచ్చే నెలలో కుజుడి స్థానంలో పెను మార్పులు.. ఈ రాశులవారి డబ్బు సంచులు నిండటం ఖాయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook