Today Gold Rate: పసిడి ప్రియులకు షాక్... భారీ పెరిగిన బంగారం ధర..!

Gold Price Today: దసరాకు ముందు పసిడి కొనుగోలుదారులకు షాక్. ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది. గోల్డ్ రేటు ఎలా ఉందంటే...  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 26, 2022, 08:07 AM IST
Today Gold Rate: పసిడి ప్రియులకు షాక్... భారీ పెరిగిన బంగారం ధర..!

Gold Price Today 26 September 2022: ఇవాల్టి నుంచే నవరాత్రులు ప్రారంభమయ్యాయి. శరన్నవరాత్రులలో బంగారం తగ్గుతుందని భావించిన వారికి షాక్ తగిలింది. పసిడి ధరలు భారీగా పెరిగాయి. ఇవాళ తులం బంగారంపై రూ.1800 వరకు పెరిగింది. గత కొన్ని  రోజులుగా గోల్డ్ రేట్లలో హెచ్చు తగ్గులు చోటుచేసుకుంటూ వస్తున్నాయి. అయితే పసిడి ధరలు ఎంత పెరిగినా కొనుగోళ్లు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. అయితే దసరా పండుగకు ముందు పసిడి ధరలు తగ్గుతాయని ఆశ పడిన సామాన్యుడికి నిరాశే మిగిలింది. దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు (Gold Price Today) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి.

తెలుగు రాష్ట్రాల్లో...
>>  హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,000 వద్ద కొనసాగుతోంది.
>> విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల రూ.52,000 ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
>>  ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.46,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,350 వద్ద ఉంది.
>> ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000 వద్ద కొనసాగుతోంది.
>> కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000 ఉంది.
>>  బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,240 ఉంది.
>>చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.46,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,730 వద్ద ఉంది.
>> కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,000 వద్ద కొనసాగుతోంది.

Also Read: Multibagger stock: 3 వేల పెట్టుబడితో 19 లక్షల రూపాయలు లాభాలు, ఆ కంపెనీ షేర్ ఫలితం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News