Laptop Hacks: ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌లో హఠాత్తుగా స్పీడ్ తగ్గిపోతుంటుంది. ఫలితంగా మీ పనిపై ప్రభావం పడుతుంది. మీ ల్యాప్‌ట్యాప్‌లో కూడా అదే సమస్య ఉంటే..కొన్ని సులభమైన పద్ధతులు అంటే హ్యాక్స్ ద్వారా స్పీడ్ బూస్ట్ చేయవచ్చు. అదెలాగో చూద్దాం..
ల్యాప్‌టాప్ స్పీడ్ బాగుండాలంటే..మార్కెట్లో కూలింగ్ ఫ్యాన్ లభిస్తుంది. దీనికి ల్యాప్‌టాప్ కింద పెట్టి వాడితే..ల్యాప్‌టాప్ నుంచి వచ్చే వేడి తగ్గుతుంది. హ్యాకింగ్ సమస్య కూడా తలెత్తదు.
కొంతమంది ల్యాప్‌టాప్‌ను క్లీన్ చేయరు. చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ లోపలకు వెళ్లిపోతుంటాయి. ల్యాప్‌టాప్ లోపలి భాగాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఇందులో ఒకసారి డస్ట్ వెళ్లిందంటే లోపలి భాగాల పనితీరుపై ప్రభావం పడుతుంది. అందుకే ఎప్పుడూ ల్యాప్‌టాప్ కవర్ చేయాలి. లేదా క్లీన్ చేస్తుండాలి.
కొంతమంది ల్యాప్‌టాప్‌ను బెడ్ మీదో లేదా సోఫా మీదో ఉంచి వినియోగిస్తుంటారు. ఇలా ఎప్పుడూ చేయకూడదు. ఇలా చేయడం వల్ల ల్యాప్‌టాప్ వెంటిలేషన్ పూర్తిగా బ్లాక్ అవుతుంది. లోపల వేడి ఉండిపోతుంది. ల్యాప్‌టాప్ స్పీడ్ ఎప్పుడూ బాగుండాలంటే ఫ్లాట్ సర్ఫేస్పైనే ఉంచాలి.
మీ ల్యాప్‌టాప్ ఒరిజినల్ ఛార్జర్ పాడై ఉంటే..ఎట్టి పరిస్థితుల్లోనూ డూప్లికేట్ లేదా వేరే ఛార్జర్ వాడవద్దు. దీనివల్ల స్పీడ్ సమస్య తలెత్తుతుంది. ప్రోసెసర్‌పై ప్రభావం పడుతుంది.
మీ ల్యాప్‌టాప్ వేగంగా పనిచేయాలంటే..ముందుగా మీ ల్యాప్‌టాప్‌లో ఉన్న హెవీ గేమ్స్ వెంటనే డిలీట్ చేయాలి. గేమ్స్ అనేవి ప్రోసెసర్‌పై ఒత్తిడి పెంచుతాయి. గేమ్స్ డిలీట్ చేయగానే ప్రోసెసింగ్ స్పీడ్ అవుతుంది. గేమ్స్ ఆడాలనే కోరిక ఉంటే ఆన్లైన్ ఆడుకుంటే మంచిది.